కలబంద - కలబంద జెల్ చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంపై ఉన్న మంటను తగ్గించి, మొటిమల మచ్చలను మాయం చేస్తుంది. రాత్రిపూట కలబంద జెల్‌ను ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
పసుపు-శనగపిండి- శనగపిండిలో చిటికెడు పసుపు, కొంచెం పెరుగు కలిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకోండి. చర్మం జిడ్డును, మురికిని తొలగించి సహజమైన మెరుపును ఇస్తుంది. ఇది చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.
పాలు- తేనె: పచ్చి పాలు చర్మాన్ని శుభ్రపరిచే క్లెన్సర్‌లా పనిచేస్తాయి. తేనె చర్మానికి తేమను అందిస్తుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
టామాటో రసం- ఎండ వల్ల చర్మం నల్లబడినప్పుడు, టొమాటో రసం అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్ చర్మాన్ని శుభ్రపరిచి, సహజమైన బ్లీచింగ్‌లా పనిచేసి చర్మాన్ని తెల్లగా మారుస్తుంది.
బొప్పాయి మాస్క్- బాగా పండిన బొప్పాయి పండును మెత్తగా చేసి ముఖానికి పట్టించండి. బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ చనిపోయిన చర్మ కణాలను తొలగించి, కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది.
రోజ్ వాటర్: చర్మంపై రంధ్రాలను (Pores) బిగుతుగా ఉంచడానికి రోజ్ వాటర్ ఉత్తమమైన టోనర్. ప్రతిరోజూ ముఖం కడుక్కున్న తర్వాత రోజ్ వాటర్‌ను స్ప్రే చేసుకోవడం వల్ల ముఖం తాజాగా ఉంటుంది.
కీరదోస- కీరదోస ముక్కలను కళ్లపై ఉంచుకోవడం వల్ల కళ్ల కింద నలుపు తగ్గుతుంది. కీరదోస రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. వేసవి కాలంలో ఇది చాలా మేలు చేస్తుంది.
కొబ్బరి నూనె మసాజ్: పొడి చర్మం (Dry Skin) ఉన్నవారికి కొబ్బరి నూనె ఒక వరం. పడుకునే ముందు కొంచెం వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకుని ముఖానికి మసాజ్ చేస్తే చర్మం లోపల నుండి పోషణ పొందుతుంది.
నీరు, సరైన నిద్ర- బయట ఎన్ని పూసినా, లోపల నుండి చర్మం మెరవాలంటే రోజుకు 3-4 లీటర్ల నీరు తాగాలి. అలాగే రోజుకు 7-8 గంటల నిద్ర చాలా అవసరం. నిద్ర లేకపోతే కళ్ల కింద వలయాలు వచ్చి ముఖం కళావిహీనంగా మారుతుంది.