హైదరాబాద్లో మరోసారి బైక్ రేసర్లు రెచ్చిపోయారు. అత్తాపూర్లో ఇద్దరు యువకులు పోలీసుల ముందే ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేశారు. ప్రధాన రహదారిపై వన్ వీల్ చేస్తూ విన్యాసాలు చేయగా, మరో ఇద్దరు వాటిని ఫోన్లో చిత్రీకరించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్టా రీల్స్ కోసం హెల్మెట్ లేకుండా ఇలా స్టంట్స్ చేస్తున్నట్లు గుర్తించి, డీసీపీ శ్రీనివాస్ వారిని కౌన్సెలింగ్ చేసి హెచ్చరించారు.