కొండా విజయ్ అరెస్టుతో వెలుగుచూసిన మరో బంగారు బాబు సూర్యభాయ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో బంగారు ఆభరణాలతో సెలబ్రిటీగా ఫోజులిచ్చిన ఇతను ధరించినవన్నీ గిల్ట్ నగలేనని తేలింది. సొంత ఇల్లు లేని సూర్యభాయ్కు ఖరీదైన కార్లు, బుల్లెట్ బైక్ ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు విచారణ కొనసాగుతోంది.