AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దరిద్రుల్లో వీడోరకం..! భార్యను 120 మందికి అమ్మిన భర్త.. కారణం తెలిస్తే ఛీ అంటారు

పెళ్లిచేసుకున్నాడు.. ఆ తర్వాత డబ్బుకోసం నీచాతి నీచ పనులు చేయడం మొదలుపెట్టాడు.. స్వయంగా భార్యతో వ్యభిచారం చేయడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా.. తన భార్యను విక్రయించడం మొదలుపెట్టాడు.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా తన భార్యను 120 మందికి విక్రయించి ఆమెతో బలవంతంగా శృంగార పనులు చేయించాడు..

దరిద్రుల్లో వీడోరకం..! భార్యను 120 మందికి అమ్మిన భర్త.. కారణం తెలిస్తే ఛీ అంటారు
Man charged in Sweden for selling wife
Shaik Madar Saheb
|

Updated on: Mar 31, 2026 | 1:03 PM

Share

ఛీ.. ఛీ.. వీడు భర్త.. కాదు.. దుర్మార్గుడు..  డబ్బుకోసం నీచాతి నీచ పనులు చేయడం మొదలుపెట్టాడు.. స్వయంగా భార్యతో వ్యభిచారం చేయడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా.. తన భార్యను విక్రయించడం మొదలుపెట్టాడు.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా తన భార్యను 120 మందికి విక్రయించి ఆమెతో బలవంతంగా శృంగార పనులు చేయించాడు.. సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ దారుణమైన ఘటన స్వీడన్ లో వెలుగుచూసింది. తీవ్రమైన వ్యభిచారానికి పాల్పడటంతో పాటు, 62 ఏళ్ల నిందితుడిపై ఎనిమిది అత్యాచారాల అభియోగాలు కూడా మోపారు. తన భార్యను 120 మందికి పైగా పురుషులకు అమ్ముకున్నాడనే ఆరోపణలపై, ఒక వ్యక్తిపై స్వీడన్ ప్రాసిక్యూటర్ సోమవారం తీవ్రమైన వ్యభిచారం, దాడి, పలు అత్యాచారాల అభియోగాలు మోపారు.

ప్రభుత్వ ప్రసార సంస్థ SVT ప్రకారం, ఆ వ్యక్తి గతంలో హెల్స్ ఏంజిల్స్ అనే బైకర్ గ్రూపులో ఉన్నత స్థాయి సభ్యుడిగా ఉండేవాడు. అయితే.. తన భార్య బలహీనతలను ఆసరాగా చేసుకున్న అతను.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. అయితే.. 2024లో ఫ్రాన్స్‌లో సంచలనం సృష్టించిన ‘గిసెల్ పెలికాట్’ కేసుతో దీనిని పోలుస్తూ మీడియా దీనిని ‘స్వీడిష్ పెలికాట్ కేసుగా పేర్కొంది.

ఉత్తర స్వీడన్‌లో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, 62 ఏళ్ల ఆ వ్యక్తిని అక్టోబర్ నెలాఖరులో అరెస్టు చేశారు.. అప్పటి నుంచి అతడిని అదుపులోనే ఉంచారు. ఛార్జ్ షీట్ ప్రకారం, ఆ వ్యక్తి తన భార్యను “లైంగిక చర్యలకు పాల్పడమని, లొంగిపోమని” ఒత్తిడి చేయడం ద్వారా సంవత్సరాలుగా ఆర్థికంగా లబ్ధి పొందాడు. ఎక్కువ మంది క్లయింట్లను ఆకర్షించడానికి ఆన్‌లైన్‌లో ప్రకటనలు చేయడం, సమావేశాలు ఏర్పాటు చేయడం, కాపలా కాయడం, ఆన్‌లైన్‌లో లైంగిక చర్యలు చేయమని మహిళపై ఒత్తిడి తేవడం వంటి ఆరోపణలు ఆ వ్యక్తిపై ఉన్నాయి.

అతను ఆమెపై హింసకు పాల్పడ్డాడని, ఆమెను బెదిరించాడని, తన పట్ల ఆమెకున్న భయాన్ని ఆసరాగా చేసుకున్నాడని, ఆమె మాదకద్రవ్యాల వ్యసనాన్ని అవకాశంగా వాడుకున్నాడని, దీనిని ప్రాసిక్యూటర్ దారుణమైన, హేయమైన చర్యగా అభివర్ణించారు. అయితే.. ఆమెను లైంగికంగా వాడుకునేందుకు విక్రయించిన సుమారు 120 మంది వ్యక్తులను అధికారులు గుర్తించారని ప్రాసిక్యూటర్ ఇడా అన్నర్‌స్టెడ్ ఫిబ్రవరిలో తెలిపారు. వారిలో ఇప్పటికే 26 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటనలు ఆగస్టు 2022 నుంచి అక్టోబర్ 2025 మధ్య జరిగాయని పేర్కొన్నారు..

అయితే.. స్వీడన్ చట్టాల ప్రకారం శృంగారం అమ్మడం నేరం కాదు కానీ, కొనడం, దానికి మధ్యవర్తిత్వం వహించడం తీవ్రమైన నేరం. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం కానుందని అక్కడి అధికారులు తెలిపారు. ఆ మహిళ తరఫు న్యాయవాది సిల్వియా ఇంగోల్ఫ్స్‌డోటిర్ మాట్లాడుతూ.. ఆమెకు న్యాయం దక్కుతుందని పేర్కొన్నారు.

కాగా.. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us