ఈ జ్యూస్‌ తాగితే ముసలితనం రాదండోయ్.. నవయవ్వనంతో మెరుస్తారు!

31 March 2026

TV9 Telugu

TV9 Telugu

మునగ కాయలు తెలియని తెలుగు వారుండరు. సాంబర్ నుంచి రకరకాల వంటకాల వరకు మునగ కాయలతో తయారు చేస్తారు. వీటితో తయారు చేసిన వంటకాలు రుచికి భలేగా ఉంటాయి

TV9 Telugu

అంతేనా.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఐరన్‌, కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి

TV9 Telugu

మునగ కాయలే కాదు దీని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా చిన్న వయసులోనే వయసు పైబడినట్లు వృద్ధాప్య ఛాయలు కనిపించే వారికి మునగాకు జ్యూస్ ఎంతో మేలు చేస్తాయి

TV9 Telugu

సాధారణంగా మునగాకు పోషకాల గని. మునగాకులో మనకు కావాల్సిన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ సమృద్ధిగా లభ్యమవుతాయి. గర్భిణిలు ఈ మునగాకు తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది

TV9 Telugu

పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇతర ఆహార పదార్థాలతో పోల్చితే మునగాకులో పోషకాలు రెండింతలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్, చర్మ సమస్యలు, జుట్టుకు సంబంధిత సమస్యలకు మునగాకు జ్యూస్‌తో చెక్ పెట్టొచ్చు

TV9 Telugu

మునగాకు జ్యూస్‌ తాగడంవల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. వృద్ధాప్యంలో కూడా కంటిచూపు చక్కగా కనిపిస్తుంది. కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా అదుపులోకి వస్తాయి

TV9 Telugu

కాల్షియం లోపంతో బాధపడేవారికి మునగాకు జ్యూస్‌ మంచి పరిష్కారం. ఆర్థరైటిస్ లాంటి కీళ్ల సమస్యలను మునగాకు జ్యూస్‌తో తగ్గించుకోవచ్చు. రెగ్యులర్‌గా మునగాకు జ్యూస్ తాగితే ఫలితం కనిపిస్తుంది

TV9 Telugu

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే లక్షణం మునగాకులో ఉంటుంది. మధుమేహం సమస్య ఉన్న వారికి ఇది మేలు చేస్తుంది. మునగాకు జ్యూస్ తరచూ తాగడంవల్ల చర్మం ముడుతలు లేకుండా యవ్వనంగా కనిపిస్తారు. అంతేకాకుండా ముఖంపై మచ్చలు, మొటిమలు వంటివి తగ్గి కాంతివంతంగా మెరుస్తుంది