AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీదేవి చేయాల్సిన పాత్ర లక్కీగా ఈమెకు దక్కింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ తిరుగులేని హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. అలాగే ఎంతో మంది హీరోలతో కలిసి సినిమాలు చేసి మెప్పించారు. శ్రీదేవి మిస్ చేసుకున్న సినిమా చేసి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారింది.

శ్రీదేవి చేయాల్సిన పాత్ర లక్కీగా ఈమెకు దక్కింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్
Sridevi
Rajeev Rayala
|

Updated on: Mar 31, 2026 | 12:45 PM

Share

తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు ఎందరో ఉన్నారు. హీరోలకు సమానంగా తామంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తెలుగు సినిమా స్టిండస్ట్రీలో జయప్రద, జయసుధల ప్రస్థానం అసాధారణమైనది. ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో వెండితెరకు పరిచయమైనప్పటికీ.. జయప్రద సినీ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొంది తన నటిగా కెరీర్ ప్రారంభించగా, జయసుధ మాత్రం ప్రఖ్యాత నటి విజయనిర్మల గారి బంధువుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలి దశలో జయసుధకు హీరోయిన్ పాత్రలు దక్కలేదు. ఆమె కేవలం చెల్లి, సైడ్ ఆర్టిస్ట్, అంధురాలైన బాలిక వంటి సహాయక పాత్రలకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితి ఆమెలో కొంత నిరాశను కలిగించినా, విజయనిర్మల గారి ప్రోత్సాహంతో జయసుధ తిరిగి పుంజుకుని, తన ప్రతిభను చాటుకున్నారు. మరోవైపు, జయప్రద తన సినీ రంగ ప్రవేశం నుంచే హీరోయిన్‌గా నటించే అవకాశాలు పొందారు. ఆమె సహజసిద్ధమైన అభినయం, చూడచక్కని రూపం, అలాగే ఆమె కళ్ళు.. బాపు, బాలచందర్ వంటి ప్రముఖ దర్శకులను ఎంతగానో ఆకర్షించాయి. ఇది ఆమెకు అనేక చిత్రాల్లో అవకాశాలు తెచ్చిపెట్టింది.

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

ముఖ్యంగా బాపు దర్శకత్వంలో వచ్చిన సీతాకళ్యాణం చిత్రం జయప్రదకు విశేషమైన విజయాన్ని అందించింది. ఆ తర్వాత ఆమె బాపు చిత్రాల కంటే బాలచందర్ దర్శకత్వంలోనే ఎక్కువ సినిమాల్లో నటించారు. ఒకానొక దశలో జయప్రద అంతులేని కథ వంటి చిత్రాల్లో సోలో కథానాయికగా కూడా కనిపించారు. ఈ సినిమా మొదట తమిళంలో తెరకెక్కి, తర్వాత తెలుగులోనూ విడుదలై సూపర్ హిట్ సాధించింది. జయప్రద, జయసుధ ఇద్దరూ తమదైన శైలిలో రాణిస్తున్న సమయంలో, అన్నగారు ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన అడవి రాముడు చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు అవసరమయ్యారు. ఈ సినిమా కోసం మొదట జయప్రదను, శ్రీదేవిని సంప్రదించారు. అయితే, శ్రీదేవి కాల్షీట్లలో సమస్యలు తలెత్తడంతో, ఆమె స్థానంలో జయసుధను ఎంపిక చేశారు. అప్పటికే కొన్ని పరాజయాలు ఎదుర్కొని ఉన్న జయసుధ, ఈ చిత్రంలో తన నటనతో పోటీపడి నటించారు.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

జయప్రద కూడా ఎన్టీఆర్ సరసన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. అయితే, చిత్ర విజయం తర్వాత ఎక్కువ క్రెడిట్ మాత్రం జయప్రదకే దక్కింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య నెలకొన్న పోటీ వాతావరణంలో ఎన్టీఆర్ నలిగిపోయేవారని, ఈ పరిణామంతో జయసుధ మళ్ళీ కొంత వెనకబడ్డారని అంటారు. అడవి రాముడు తర్వాత, హీరోలు కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోల సరసన జయప్రద, జయసుధ కలిసి నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని చిత్రాల్లో జయసుధ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోగా, మరికొన్ని సినిమాల్లో జయప్రదకు మంచి మార్కులు పడ్డాయి. కాలక్రమేణా వీరిద్దరూ మంచి స్నేహితురాళ్లుగా మారారు. అయితే ఆ తర్వాత కాలంలో జయప్రద రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని జయసుధ తప్పుపట్టారు. ఇదే వారి మధ్య విభేదాలకు దారితీసిందని చాలామంది చెబుతారు. కానీ, ఆశ్చర్యకరంగా జయసుధ కూడా తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇది వారిద్దరి ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మలుపు.

ఇవి కూడా చదవండి

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ నెయిల్ పాలిష్ కలర్ మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుందా? ఈ జ్యోతిష్య
మీ నెయిల్ పాలిష్ కలర్ మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుందా? ఈ జ్యోతిష్య
శ్రీదేవి చేయాల్సిన పాత్ర లక్కీగా ఈమెకు దక్కింది..
శ్రీదేవి చేయాల్సిన పాత్ర లక్కీగా ఈమెకు దక్కింది..
ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర.. ఎంతంటే..?
ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర.. ఎంతంటే..?
నొప్పితో అస్పత్రికి వస్తే.. డాక్టర్ చేసిన పనికి అంతా షాక్!
నొప్పితో అస్పత్రికి వస్తే.. డాక్టర్ చేసిన పనికి అంతా షాక్!
మటన్ ఇష్టంగా తింటున్నారా..? అయితే.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
మటన్ ఇష్టంగా తింటున్నారా..? అయితే.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
సుడిగాలి సుధీర్‌ను చాలా మిస్ అవుతున్నా..
సుడిగాలి సుధీర్‌ను చాలా మిస్ అవుతున్నా..
ఆలూ వంటకాలు మీకూ ఇష్టమా..? మండే ఎండల్లో ఇలా తినడం యమ డేంజర్
ఆలూ వంటకాలు మీకూ ఇష్టమా..? మండే ఎండల్లో ఇలా తినడం యమ డేంజర్
కాసుల కక్కుర్తితో.. జనం ప్రాణాలు తీస్తున్న కల్తీగాళ్లు!
కాసుల కక్కుర్తితో.. జనం ప్రాణాలు తీస్తున్న కల్తీగాళ్లు!
భోజనంలో ఉప్పు తక్కువ తింటున్నారా? డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..
భోజనంలో ఉప్పు తక్కువ తింటున్నారా? డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..
భక్తులను ఆహ్వానిస్తున్న దక్షిణాది అమర్నాథ్.. సలేశ్వరం జాతర...
భక్తులను ఆహ్వానిస్తున్న దక్షిణాది అమర్నాథ్.. సలేశ్వరం జాతర...