చాణక్య నీతి : అంతా కోల్పోయినట్లు అనిపిస్తే ఏం చేయాలో తెలుసా?
Samatha
1 April 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన తన కాలంలో అనుభవాల ఆధారంగా నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
అయితే అవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇక కష్టాలు రావడం అనేది సహజం. కొన్ని సార్లు కష్టాల వలన అంతా కోల్పోయినట్లు అనిపిస్తుంది.
కష్టాలు
ఇక ఏమీ మిగిలి లేదు అంతా కోల్పోయాం అనిపిస్తే ఏం చేయాలి. ఇలాంటి సమయంలో ప్రజలు ఎలా ఉండాలి అనే దాని గురించి చాణక్యుడు తెలియజేయడం జరిగింది.
అంతా కోల్పోయాం
ఏదో ఒక సందర్భంలో అంతా అయిపోయిందని అనిపిస్తుంది, చుట్టూ చీకటి కమ్ముకుంటుంది. అటువంటిసమయంలో చాలా ఓపికగా ఉండటమే కాకుండా, భారాన్ని వదిలి పెట్టాలి, గతాన్ని మర్చిపోవాలంట.
అంతా అయిపోయింది
అదే విధంగా కష్ట సమయాల్లో చాలా మంది మీ బలహీనతపై దెబ్బతీస్తుంటారు. అటువంటి సమయంలో మీ బలాలను తీసుకొని, మిమ్మల్ని మీరు నమ్మి, ముందడుగు వేయాలి.
కష్ట సమయాలు
అలాగే కష్టాలు ప్రతి ఒక్కరినీ పరీక్షిస్తాయి. కష్ట సమయాల్లో ఓపిక కోల్పోతే ఓడిపోతారు, ప్రతి చీటికటి తర్వాత తెల్లవారు జాము ఉంటుంది. అందుకే సరైన నిర్ణయం తీసుకొని కష్టపడి పని చేయాలంట.
ఓపిక
అంతే కాకుండా తిరిగి కోలుకోవడానికి మీ ప్రణాళికలు చాలా రహస్యంగా ఉంచి, మీ విజయం కోసం మీరే ముందడుగు వేయాలి. అప్పుడే సక్సెస్ అవుతారు.
ప్రణాళికలు
మీరు చేయాలి అనుకునేది, మీ సాధించాలనుకునేది వేరే వారికి తెలిస్తే, అవి విఫలం అయ్యే ఛాన్స్ ఉంటుంది. రహస్యంగా ఏ పని చేసినా, అది మీకు విజయాన్ని ఇస్తుంది.