Tollywood: ఈ చిన్నారి కిట్టయ్య సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో.. ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే.. గుర్తుపట్టగలరా ?..
ఆ చిన్నారి కిట్టయ్య ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీర్. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవల్లో ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా.. ఈహీరో సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. దాదాపు మూడు దశబ్దాలకు పైగా సినీపరిశ్రమలో అగ్రకథానాయకుడిగా కొనసాగుతున్నారు.

గత కొద్ది రోజులుగా స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందుకే ఇప్పుడు మీకోసం ఓ హీరో చైల్డ్ హుడ్ ఫోటో తీసుకోచ్చాం. పైన ఫోటోను చూశారు కదా.. ఆ చిన్నారి కిట్టయ్య ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీర్. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవల్లో ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా.. ఈహీరో సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. దాదాపు మూడు దశబ్దాలకు పైగా సినీపరిశ్రమలో అగ్రకథానాయకుడిగా కొనసాగుతున్నారు. 48 ఏళ్ల వయసులోనూ 27 ఏళ్ల కుర్రాడిగా ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తున్న ఈ హీరో ఎవరో చెప్పగలరా .. తనే దళపతి విజయ్. కోలీవుడ్ లో టాప్ హీరో. అయినా తెలుగుతోపాటు.. హిందీలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. దళపతి అంటూ ఫ్యాన్స్ ఎంతో ముద్దుగా పిలుచుకుంటారు.
1974 జూన్ 22న విజయ్ జన్మించారు. ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ తమిళ్ సినిమా దర్శకుడు. తల్లి శోభ నేపథ్యగాయని 1984లో బాలనటుడిగా కెరీర్ ఆరంభించాడు విజయ్. తన తండ్రి దర్శకత్వం వహించిన పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు. ఆ తర్వాత 1992లో హీరోగా నాలయ తీర్పు సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత 1996లో విడుదలైన పూవె ఉనక్కాగ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ తర్వాత విజయ్ వెనుదిరిగి చూసుకోలేదు.




ఇప్పటివరకు 61 చిత్రాల్లో నటించారు. తమిళంలో విజయ్ నటించిన చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఆయనకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే నేరుగా తెలుగులో వారసుడు సినిమా చేశారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఆయన లియో చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ లోకేషన్ కనకరాజన్ దర్శకత్వం వహిస్తుండగా.. త్రిష కథానాయికగా నటిస్తుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత త్రిష, విజయ్ జోడి కట్టడంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



