Tollywood: చిన్నప్పుడే కారు డ్రైవ్ చేస్తోన్న ఈ చిన్నోడిని గుర్తుపట్టండి.. అతని ప్రేమ కోసం మహారాణి కదిలొచ్చింది..
సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో. భాషతో సంబంధం లేకుండా అతడికి భారీగా ఫాలోయింగ్ ఉంది. నిజానికి అతను మలయాళీ సినీ పరిశ్రమలో స్టార్ హీరో. తెలుగులోనే ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది ఒకటి రెండు సినిమాలే అయిన తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఎవరో గుర్తుపట్టారా ?.

పైన ఫోటోలో చిన్నప్పుడే కారు డ్రైవ్ చేస్తున్న ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా ?.. సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో. భాషతో సంబంధం లేకుండా అతడికి భారీగా ఫాలోయింగ్ ఉంది. నిజానికి అతను మలయాళీ సినీ పరిశ్రమలో స్టార్ హీరో. తెలుగులోనే ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది ఒకటి రెండు సినిమాలే అయిన తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఎవరో గుర్తుపట్టారా ?. అతనే మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్. ప్రముఖ నటుడు మమ్ముట్టి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు అగ్రకథానాయకుడిగా స్టార్ డమ్ అందుకున్నాడు. 2012లో సెకండ్ షో సినిమాతో తెరంగేట్రం చేశాడు దుల్కర్. ఆ తర్వాత ఆయన నటించిన ఉస్తాద్ హోటల్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఇక మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే తమిళం, తెలుగులోనూ పలు సినిమాలు చేశారు. దుల్కర్ సల్మాన్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విజయం అందుకున్నాయి. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాలో సీనియర్ దివంగత నటుడు జెమినీ గణేశన్ పాత్ర పోషించారు. ఇందులో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.




ఇక ఆయన నటించిన కురుప్, ఓకే బంగారం, జనతా హోటల్, హే సినామికా, సెల్యూట్, అందమైన జీవితం సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఇటీవలే డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నేరుగా నటించిన తొలి చిత్రం ఇది. ఈ సినిమా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.