Captain Miller Teaser: ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ టీజర్ రిలీజ్.. ఫుల్ మాస్ యాక్షన్స్ సీన్స్తో అదరగొట్టేసిన హీరో..
బ్రిటిష్ కాలం నాటి కథతో ఓ యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో ధనుష్ జోడిగా ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ క్యూరియాసిటిని కలిగించాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటుంది.

ఇటీవలే సార్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు తమిళ్ స్టార్ ధనుష్. ఇటు తెలుగుతోపాటు.. అటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ధనుష్ నటిస్తోన్న చిత్రం కెప్టెన్ మిల్లర్. బ్రిటిష్ కాలం నాటి కథతో ఓ యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో ధనుష్ జోడిగా ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ క్యూరియాసిటిని కలిగించాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటుంది. తాజాగా ఈ రోజు (జూలై 28)న ధనుష్ బర్త్ డే కావడంతో కెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ వీడియో మొత్తం పోరాట సన్నివేశాలు.. యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్లకు.. కెప్టెన్ మిల్లర్ కి ముధ్య జరిగే కథలా ఉంది. ఇందులో ధనుష్ ఫుల్ మాస్ యాక్షన్ సీన్స్ చేయబోతున్నట్లుగా టీజర్ చూస్తే తెలుస్తోంది. సందీప్, ప్రియాంక పవర్ ఫుల్ పాత్రలు పోషిస్తున్నారు. 100 సెకన్స్ నిడివి ఉన్న టీజర్.. సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఈ సినిమా డిసెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమా ధనుష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. అంతేకాకుండా పీరియాడిక్ నేపథ్యంతో వస్తోన్న సినిమా కావడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో ధనుష్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనుంది.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
