Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నేషనల్ గోల్ఫ్ ప్లేయర్ కూడా
పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఈ చిన్నారి ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే టాప్ సెలబ్రిటీ. దక్షిణాదితో పాటు హిందీ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. పేరుకు పంజాబీ బ్యూటీనే అయినా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో నటించింది.
పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఈ చిన్నారి ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే టాప్ సెలబ్రిటీ. దక్షిణాదితో పాటు హిందీ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. పేరుకు పంజాబీ బ్యూటీనే అయినా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో నటించింది. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని సూపర్ హిట్ సినిమాలు ఖాతాలో వేసుకుంది. తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున, సాయి ధరమ్ తేజ్ తదితర స్టార్ హీరోల సరసన నటించింది. అయితే కొన్నిరోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడిని వివాహం చేసుకుంది. దీంతో ఇండస్ట్రీలో ఈ అమ్మడి జోరు కాస్తా తగ్గింది. అయితే ఈ అందాల తార సినిమాలతో పాటు ఇతర విషయాలతోనూ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు చెందిన ఒక మహిళా మంత్రి ఈ ముద్దుగుమ్మపై ఇటీవల చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు టాలీవుడ్ లో తీవ్ర ప్రకంపనలు రేపాయి. అలాగే ఈ సొగసరి సోదరుడు కూడా వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఇటీవల ఓ డ్రగ్స్ రాకెట్ లోనూ ఈ బ్యూటీ సోదరుడి పేరు ప్రముఖంగా వినిపించింది. మరి ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈ క్యూటీ మరెవరో కాదు క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. గురువారం (అక్టోబర్ 10) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రకుల్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అలాగే రకుల్ కు చెందిన చిన్న నాటి, అరుదైన ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఇప్పటికే రకుల్ నటించిన రెండు సినిమాలు రిలీజయ్యాయి. అందులో అయలాన్ సూపర్ హిట్ గా నిలవగా, భారతీయుడు 2 ప్లాఫ్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కమల్ హాసన్ భారతీయుడు 2 తో పాటు దే దే ప్యార్ దే 2 తదితర సినిమాల్లో నటిస్తోంది రకుల్. కాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నాని తో పెళ్లిపీటలెక్కింది రకుల్. కొన్ని నెలల క్రితం వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. దాదాపు రెండేళ్లు డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరు ఈ ఏడాది ఫిబ్రవరిలో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు.
భర్తతో రకుల్ ప్రీత్ సింగ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..