Sobhita dhulipala: సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభితా దూళిపాళ.

Sobhita dhulipala: సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభితా దూళిపాళ.

Anil kumar poka

|

Updated on: Oct 10, 2024 | 10:23 AM

శోభిత ధూళిపాల త్వరలోనే అక్కినేని వారింటి కోడలు కాబోతుంది. అక్కినేని అందగాడు నాగ చైతన్యతో శోభిత ఎంగేజ్‌మెంట్‌ ఆగస్ట్‌ 8న జరిగింది. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితమే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే అదేం లేదంటూ కొట్టిపారేసిన ఈ జంట.. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టింది.

శోభిత ధూళిపాల త్వరలోనే అక్కినేని వారింటి కోడలు కాబోతుంది. అక్కినేని అందగాడు నాగ చైతన్యతో శోభిత ఎంగేజ్‌మెంట్‌ ఆగస్ట్‌ 8న జరిగింది. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితమే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే అదేం లేదంటూ కొట్టిపారేసిన ఈ జంట.. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. అప్పటి నుంచి శోభిత పేరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది. ఆమె ఏం మాట్లాడినా అది న్యూస్‌ అవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చెల్లి సమంత గురించి మాట్లాడింది. అది కాస్త నాగ చైతన్య మాజీ భార్య, హీరోయిన్‌ సమంత గురించే అన్నట్లుగా నెటిజన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు.

శోభితా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే.. తన చెల్లి సమంత అంటే చాలా ఇష్టమని చెప్పింది. తన సోల్‌మేట్‌ అనీ ఈ మధ్యే తన పెళ్లి అయిందనీ అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న తన చెల్లిని చూసినప్పుడు ఆనందంతో కళ్లు చెమ్మగిల్లాయనీ అంది. తన పెళ్లి కారణంగానే తమ బంధువులనంతా కలుసుకున్నారనీ.. కెరీర్‌లో బీజీగా ఉండడం వల్ల ఇన్నాళ్లు వారికి దూరమైనట్లు చెప్పింది శోభిత. ఇకపై పర్సనల్‌ లైఫ్‌కి కూడా సమయం కేటాయిస్తానని శోభితా చెప్పుకొచ్చింది. అదే ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి కోరిక ఏంటో కూడా శోభితా చెప్పింది. తనకు చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉండేదనీ అది అమ్మ కావడమనీ అంది. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఉందని శోభిత చెప్పుకొచ్చింది. ఇక కాబోయే భర్త నాగచైతన్య గురించి ఏం చెప్పిందంటే.. చైతు చాలా మర్యాదస్తుడనీ ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడనీ ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడనీ తెలిపింది. అతనిలోని ఈ లక్షణాలు తనకు చాలా ఇష్టమంటూ చెప్పింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.