Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?
సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న తెలుగు అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. 17 ఏళ్లకే సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ లోనూ సందడి చేసింది.

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి టాలీవుడ్ లో బాగా ఫేమస్. ఏపీలోని తెనాలి ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో పెరిగింది. సైకాలజీతో పాటు జర్నలిజంలోనూ డిగ్రీ పట్టా పుచ్చుకుంది. సైకాలజిస్టు కావాలని కలలు కన్న ఈ అందాల తార 17 ఏళ్లకే చదువుకు టాటా చెప్పేసింది. నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. అది కూడా హీరోయిన్ గా కాకుండా ఒక సహాయక నటి పాత్రతో. ఆ తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఇక టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ లోనూ సందడి చేసింది. ఈ షోతో ఈ అమ్మడి క్రేజ్ కాస్తా నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. మరిన్ని సినిమాలు, వెబ్ సిరీసుల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఈ అమ్మడి అందరికీ షాక్ ఇస్తూ విదేశాలకు వెళ్లిపోయింది. సినిమా అవకాశాలను వదిలేసుకుని ప్రస్తుతం ఫారిన్ లోనే ఉన్నత చదువులు అభ్యసిస్తోంది. అక్కడే ఫారినర్‌తో ప్రేమలో పడిందని కూడా వార్తలు వచ్చాయి. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ఉయ్యాల జంపాల మూవీ నటి, బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం.
ఈ బ్యూటీ బుధవారం (మే28) తన 29వ పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెప్పారు. అదే సమయంలో పునర్నవికి సంబంధించిన పలు ఆసక్తికర ఫొటోలు, విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించింది పునర్నవి. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నత చదువుల కోసం విశేషాలకు వెళ్లిపోయింది. అప్పుడప్పుడు మాత్రమే హైదరాబాద్ వస్తుంటుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే పునర్నవి రెగ్యులర్ గా తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. కాగా ఈ ముద్దుగుమ్మ ఒకరితో ప్రేమలో ఉందని, త్వరలో ఇద్దరి పెళ్లి కూడా జరగనుందని ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఒక అబ్బాయితో పున్ను కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. అయితే ఈ రూమర్లపై పునర్నవి ఇప్పటివరకు స్పందించలేదు.

Punarnavi Bhupalam
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








