AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: ప్రభాస్ స్పిరిట్ కన్నా ముందు దీపిక రిజెక్ట్ చేసిన సినిమాలివే.. ఆ బ్లాక్ బస్టర్స్ కూడానా!

ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపిక పదుకొణె తప్పుకోవడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే స్పిరిట్ కంటే ముందు దీపిక ఇలాగే పలు సినిమాలను వదులుకుంది. అందులో కొన్ని సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

Deepika Padukone: ప్రభాస్ స్పిరిట్ కన్నా ముందు దీపిక రిజెక్ట్ చేసిన సినిమాలివే.. ఆ బ్లాక్ బస్టర్స్ కూడానా!
Deepika Padukone
Basha Shek
|

Updated on: May 28, 2025 | 6:45 PM

Share

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్ర‌భాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా స్పిరిట్. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ సినిమాపై వరుస అప్డేట్స్ వస్తుండడంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. కాగా స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ దీపికా ప‌దుకొణె హీరోయిన్ గా న‌టిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి నటించిన కల్కి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో స్పిరిట్ కూడా భారీ విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి దీపిక తప్పుకుంది. దీనిపై ఇప్పుడు పెద్ద రాద్ధాంతమే నడుస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే స్పిరిట్ కన్నా ముందు దీపిక తన కెరీర్ లో వివిధ కారణాలతో చాలా సినిమాలను మిస్ చేసుకుంది. అందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్లు మరికొన్ని బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అలా దీపిక నో చెప్పిన సినిమాలేంటో ఒకసారి చూద్దాం రండి.

సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో 2022లో తెర‌కెక్కిన గుంగూబాయి క‌థియావాడి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇందులో అలియా భట్ అద్భుతంగా నటించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. అయితే ఈ సినిమా ఆఫ‌ర్ ముందుగా దీపికాకే వ‌చ్చింద‌ట‌. కానీ అప్పుడు కొన్ని కార‌ణాల వ‌ల్ల దీపికా ఆ సినిమాను చేయలేక‌పోయింది. ఇక బాలీవుడ్ చాక్లెట్ బాయ్ ర‌ణ్‌బీర్ క‌పూర్ హీరోగా 2011లో వ‌చ్చిన రాక్‌స్టార్ సినిమాలో కూడా దీపికానే హీరోయిన్ గా చేయాల్సిందట. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో తప్పుకుందట. అలాగే 2016లో సల్మాన్ బ్లాక్ బస్టర్ మూవీలో హీరోయిన్ ఆఫర్ కూడా ముందు దీపిక దగ్గరికే వెళ్లిందట. కానీ అప్పుడు కూడా వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా ఛాన్స్ కాస్తా అనుష్క శర్మకు వెళ్లిపోయింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది

ఇవి కూడా చదవండి

ఇవే కాదు 2015లో వ‌చ్చి ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్7, 2013లో ధూమ్3 సినిమాల ఆఫర్లు కూడా ముందుగా దీపికకే వచ్చాయట. కానీ డేట్స్ సర్దుబాటు చేయలేక తప్పుకుందట. ఇక షారుఖ్ ఖాన్ జబ్ తక్ హై జాన్ సినిమాలో కోసం కూడా ముందుగా దీపికానే అప్రోచ్ అయ్యార‌ట‌. ఆమె వద్దని చెప్పడంతోనే ఆ ఛాన్స్ క‌త్రినా కైఫ్ కు వెళ్లింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.