OTT Movies: ఈ వారం ఓటీటీల్లో దబిడి దిబిడే.. స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు, సూపర్ హిట్ మూవీస్ ఈ వీక్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నాని హిట్ 3, సూర్య రెట్రో, మోహన్ లాల్ తుడ్ రుమ్ సినిమాలు.

ఎప్పటిలాగే ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. వీటిలో మంచు మనోజ్, బెల్లం కొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ లు హీరోలుగా నటించిన భైరవం మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ షష్టిపూర్తి సినిమా కూడా ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఓటీటీలో కూడా సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అందులో ప్రధానంగా నాని ‘హిట్ 3’, సూర్య ‘రెట్రో’ సినిమాలతో పాటు మలయాళ సూపర్ స్టార్ తుడ్ రుమ్ సినిమాల కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంత గానో ఎదురు చూస్తున్నారు. అలాగే అజ్ఞాతవాసి అనే కన్నడ డబ్బింగ్ మూవీ కూడా తప్పకుండా చూడాల్సిన సినిమానే. వీరితో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి మే ఆఖరి వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో..
- మైక్ బిర్బిగిలియా (ఇంగ్లిష్ సినిమా) – మే 26
- కోల్డ్ కేస్: ద టైలీనాల్ మర్డర్స్ (డాక్యుమెంటరీ వెబ్ సిరీస్) – మే 26
- హిట్ 3 (తెలుగు సినిమా) – మే 29
- ఏ విడోస్ గేమ్ (స్పానిష్ మూవీ) – మే 30
- లాస్ట్ ఇన్ స్టార్ లైట్ (కొరియన్ సినిమా) – మే 30
- ద హార్ట్ నోస్ (స్పానిష్ సినిమా) – మే 30
- రెట్రో (తెలుగు సినిమా) – మే 31
జియో హాట్‌స్టార్
- కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ (ఇంగ్లిష్ మూవీ) – మే 28
- క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – మే 29
- ఏ కంప్లీట్ అన్‌నోన్ (ఇంగ్లీష్ సినిమా) – మే 31
- తుడరమ్ (తెలుగు సినిమా)- మే 30
ജിയോഹോട്ട്സ്റ്റാറിൽ തുടരും!
Thudarum will be streaming from 30 May only on JioHotstar.@mohanlal @shobana_actor @Rejaputhra_VM @talk2tharun#Thudarum #JioHotstar #JioHotstarMalayalam #ThudarumOnJioHotstar #Mohanlal #Shobhana #MalayalamCinema #Mollywood #ThudarumMovie… pic.twitter.com/9DPjB8zio3
— JioHotstar Malayalam (@JioHotstarMal) May 26, 2025
జీ5
- అజ్ఞాతవాసి (కన్నడ సినిమా) – మే 28
సోనీ లివ్
- కంఖజురా (హిందీ వెబ్ సిరీస్) – మే 30
ఆపిల్ ప్లస్ టీవీ
- బోనో: స్టోరీస్ ఆఫ్ సరండర్ (ఇంగ్లిష్ మూవీ) – మే 30
- లులు ఇన్ రైనోసిరోస్ (ఇంగ్లిష్ సినిమా) – మే 30
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








