AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda: అతనికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన హీరో విజయ్‌ దేవరకొండ.. వీడియో చూస్తే ఫిదా అవుతారంతే

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఓ భారీ హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకే తన కెరీర్ లోనే మొదటిసారిగా ఓ విభిన్నమైన సినిమాలో నటిస్తున్నాడీ క్రేజీ హీరో. విజయ్ నటిస్తోన్ కింగ్ డమ్ సినిమా జులై 04న విడుదల కానుంది.

Vijay Devarakonda: అతనికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన హీరో విజయ్‌ దేవరకొండ.. వీడియో చూస్తే ఫిదా అవుతారంతే
Vijay Deverakonda
Basha Shek
|

Updated on: May 27, 2025 | 5:34 PM

Share

ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు యావరేజ్ గా నిలిచినా విజయ్ దేవరకొండ అభిమానులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అంతకు మించి విజయ్ ఫ్యాన్స్ ఇంకేదో కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే విజయ్ కూడా కింగ డమ్ పేరుతో ఓ డిఫరెంట్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కింగ్ డమ్ సినిమా జులై 04న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులోనూ టీజర్‌కు అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు భారీ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. ఈ క్రమంలో సినిమాకు సంగీతం అందిస్తోన్న అనిరుధ్ కు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఇందుకు సంబంధించిన వీడియోను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో విజయ్ తన రౌడీ బ్రాండ్ టీ షర్ట్ తో పాటు షటిల్ బ్యాట్‌ను అనిరుధ్‌కు అందజేశారు. అలాగే చాలా సేపు ఇద్దరు కలిసి కింగ్ డమ్ సినిమా, సంగీతం, పాటల గురించి మాట్లాడుకుంటూ కనిపించారు. ఆ తర్వాత విజయ్ బహూకరించిన టీ షర్ట్ వేసుకుని అనిరుధ్ వచ్చాడు. ఆ తర్వాత అందరూ కలిసి షటిల్ ఆడటానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా విజయ్ గిఫ్ట్ ఇచ్చిన టీ షర్ట్ లో అనిరుధ్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా కింగ్ డమ్ సినిమాలో విజయ్ దేవరకొండ పూర్తిగా మాస్ అవతారంలో కనిపించనున్నాడు.

సింగర్ అనిరుధ్ తో విజయ్ దేవరకొండ.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ కొత్త ఈవీ స్కూటర్
మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ కొత్త ఈవీ స్కూటర్
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..