Gaddar Awards: గద్దర్ అవార్డులు.. ఉత్తమ నటీనటులుగా అల్లు అర్జున్, నివేదా థామస్.. పూర్తి జాబితా ఇదే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను గురువారం ఉదయం జ్యూరీ ఛైర్ పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆమె.. దాదాపు 1248 నామినేషన్లను పరిశీలించి అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు.

గద్దర్ అవార్డ్స్ మొట్టమొదటిసారిగా ప్రకటన చేయటం జరిగింది. మసాబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ లో గద్దర్ కమిటీ అవార్డులను ప్రకటించింది. ఇవి గద్దర్ పేరుపై ఇస్తున్న మొదటి సినిమా అవార్డ్స్. ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కల్కి గద్దర్ ఫిలిం అవార్డు దక్కించుకోగా ఉత్తమ నటుడిగా పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్ పొందారు. గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో బెస్ట్ ఫిలిం గా మొదటి సినిమా కల్కి కాగా రెండో సినిమా పొట్టేలు, మూడవ ఉత్తమ సినిమా గా దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ చోటు సంపాదించుకుంది. డెబ్యూ సినిమా గా కమిటీ కుర్రోళ్ళు మూవీ గద్దర్ వార్డు దక్కించుకుంది.
బెస్ట్ డైరెక్టర్ గా కల్కి సినిమాకు నాగ్ అశ్విన్ గద్దర్ ఫిలిం అవార్డు దక్కించుకోగా.. బెస్ట్ లీడింగ్ యాక్టర్ గా పుష్ప 2 సినిమాకు అల్లు అర్జున్ పేరు ప్రకటించారు. ఇక 35 చిన్న కథ కాదు సినిమాకు గానూ ఉత్తమ నటిగా నివేదా థామస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఎస్ జె సూర్య… బెస్ట్ సపోర్టింగ్ నటిగా శరణ్య ప్రదీప్ కి అవార్డు దక్కింది. ఇక రజాకార్ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ సిసిరోలియోకి అవార్డు దక్కింది. బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా సిద్ శ్రీరామ్ నిజమైనా చెబుతున్న జనేజనా పాటకి గానూ దక్కింది. ఇక పుష్ప 2 సినిమాకి శ్రేయ ఘోషల్ కు బెస్ట్ ఫిమేల్ సింగర్ గా చోటు దక్కింది. బెస్ట్ కమెడియన్ గా సత్య, వెన్నెల కిషోర్ మత్తు వదలరా 2 సినిమాకు దక్కింది. స్పెషల్ జ్యూరీ అవార్డుగా దుల్కర్ సల్మాన్ రెండో అవార్డుగా అనన్య నాగళ్ళ, మూడో అవార్డు సుజిత్ అండ్ ప్రదీప్ కి, నాలుగో జూరీ అవార్డు ప్రశాంత్ రెడ్డి, స్పెషల్ జూరి మెన్షన్ గా మత్తు వదలరా 2 సినిమాకి హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు అవార్డు దక్కింది. ఇక ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచిన కల్కి సినిమా , పుష్ప 2 సినిమాలకు గద్దర్ అవార్డులలో స్థానం దొరకగా అనూహ్యంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా ఎక్కువ విభాగాల్లో తెలంగాణ గద్దర్ సినిమా అవార్డుల లో స్థానం దక్కించుకోవడం విశేషం. నంది అవార్డులను గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుగా మార్చిన సంగతి అందరికీ తెలిసిందే.
గద్దర్ అవార్డుల పూర్తి జాబితా..
— 14 ఏళ్ల తర్వాత అవార్డుల ప్రకటన
— 2024 ఉత్తమ మొదటి చిత్రం కల్కి
— 2024 రెండవ ఉత్తమ చిత్రం పొట్టేల్
— 2024 మూడవ ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్
— ఉత్తమ దర్శకుడు – నాగ్ అశ్విన్ – కల్కి
— ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ – పుష్ప2
— ఉత్తమ గాయని – శ్రేయా ఘోషల్ – పుష్ప2
— ఉత్తమ నటి – నివేదా థామస్ -35
— ఉత్తమ స్కీన్ ప్లే – వెంకీ అట్లూరి -లక్కీ భాస్కర్
— ఉత్తమ హాస్యనటులు – వెన్నెల కిషోర్, సత్య
— ఉత్తమ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య -దేవర
— స్పెషల్ జ్యూరీ అవార్డు – దుల్కర్ సల్మాన్ – లక్కీ భాస్కర్
— స్పెషల్ జ్యూరీ అవార్డు – అనన్య నాగళ్ల – పొట్టేల్
— స్పెషల్ జ్యూరీ అవార్డు – ఫరియా అబ్దుల్లా – మత్తు వదలరా2
— ఉత్తమ బాలల చిత్రం – 35 ఇది చిన్న కథ కాదు
— రజాకార్ చిత్రానికి ఫీచర్ హెరిటేజ్ విభాగంలో అవార్డు
— ఉత్తమ కథా రచయిత – శివ పాలడుగు
— ఉత్తమ పుస్తకం – రెంటాల జయదేవ్ – మనసినిమా పుస్తకం
— ఉత్తమ గీత రచయిత – చంద్రబోస్
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..
