Alia Bhatt: ఆ సౌత్ ఇండియన్ స్టార్ హీరో యాక్టింగ్ ఎంతో ఇష్టం.. ఆలియా షాకింగ్ కామెంట్స్
సౌత్ ఇండస్ట్రీ గురించి ఏదో సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నారు ఆలియాభట్. లేటెస్ట్ ఫాహద్ ఫాజిల్ పేరు ప్రస్తావించేశారు. గతంలో ఐకాన్ స్టార్ గురించి చెప్పిన మాటలను కూడా గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు.. ఇంతకీ ఫాహద్ పేరును ఆలియా ఎందుకు పలికినట్టు? ఎత్తర జండా అంటూ ట్రిపుల్ ఆర్ లో ఆడిపాడిన సిల్వర్ స్క్రీన్ సీత... ఆలియా భట్.
Updated on: May 29, 2025 | 11:44 AM

ఎత్తర జండా అంటూ ట్రిపుల్ ఆర్ లో ఆడిపాడిన సిల్వర్ స్క్రీన్ సీత... ఆలియా భట్. రాజమౌళితో పనిచేయాలనే ఆమె కోరిక ఆ మూవీతో తీరింది. కానీ అనుకోని అదృష్టంగా తారక్, చరణ్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు మిసెస్ రణ్‌బీర్.

సౌత్ గురించి, సౌత్ హీరోల గురించి అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నారు ఆలియా భట్. ఆ మధ్య పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ మీద ప్రశంసల వర్షం కురిపించారు.

ఆయనతో పనిచేసే ఛాన్స్ వస్తే తాను రెడీగా ఉన్నానని హింట్ ఇచ్చారు. పుష్పరాజ్ మేనియా అలాంటిది మరి.. ఇప్పుడు మళ్లీ మరో సౌత్ హీరో గురించి ప్రస్తావించారు ఆలియా.

మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ నటనంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఆయన నటించిన ఆవేశం సినిమాను చాలా సార్లు చూశానని చెప్పారు ఈ బ్యూటీ.

ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్ కుదిరిన ప్రతిసారీ నాయికగా ఆలియా పేరు వినిపిస్తూనే ఉంది. ఎస్ఎస్ఎంబీ 29లోనూ ఆలియా ఉండొచ్చనే టాక్ నడిచింది. అందులో లేరనే విషయం కన్‌ఫర్మ్ అయినా, నియర్ ఫ్యూచర్‌లో మాత్రం ఆల్ఫా లేడీ సౌత్ ప్రాజెక్ట్ పక్కా అని ఇష్టంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.




