- Telugu News Photo Gallery Cinema photos War 2 kiara advani vs disha patani in this new look now trending in bollywood
బాలీవుడ్ లో బికినీ వార్.. నేనంటే నేనంటున్న ముద్దుగుమ్మలు
ఏ టైమ్‌లో ఎలా ట్రెండ్ అవ్వాలో బాలీవుడ్ బ్యూటీస్‌కు తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే దిశాపాట్నీ ఈ విషయంలో మరింత స్పీడుగా ఉంటారు. అందుకే ప్రజెంట్ ట్రెండ్‌లో ఉన్న ఓ ఫార్ములాను పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకున్నారు ఈ బ్యూటీ. ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో ట్రెండింగ్ టాపిక్ వార్ 2.
Updated on: May 28, 2025 | 1:30 PM

ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో ట్రెండింగ్ టాపిక్ వార్ 2. రీసెంట్‌గా టీజర్ రిలీజ్ కావటంతో ఇండస్ట్రీ అంతా ఈ సినిమా గురించే డిస్కషన్ జరుగుతోంది.

ముఖ్యంగా ఈ సినిమాలో హీరోల యాక్షన్‌కు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో... రెండు సెకన్లు మాత్రమే కనిపించిన కియారా లుక్‌కు అంతకు మించి రెస్పాన్స్ వచ్చింది.

ఇన్నాళ్లు గ్లామర్ రోల్స్ చేసినా... బికినీలో మాత్రం కనిపించలేదు కియారా. ఫస్ట్ టైమ్ వార్ 2 కోసం బికినీలో కనిపించారు ఈ బ్యూటీ. అందుకే టీజర్‌లో జస్ట్ అలా రెండు సెకన్లు మాత్రమే ఫ్లాష్ అయినా... ఆ లుక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అయ్యింది. కియారా బికినీ లుక్ వైరల్ కావటంతో అంతకు మించి అన్న రేంజ్‌లో ఫోటోస్ షేర్ చేశారు దిశాపాట్నీ.

గతంలోనూ దిశా ఇలాంటి ఫోటోస్ పోస్ట్ చేసినా... ప్రజెంట్ కియారా లుక్ మీద డిస్కషన్ జరుగుతున్న టైమ్‌లో దిశ పిక్స్ వైరల్ కావటం ఆసక్తికరంగా మారింది. కియారాకు కౌంటర్‌గానే దిశా ఈ ఫోటోస్ షేర్ చేశారా అన్న డౌట్స్ రెయిజ్ చేస్తున్నారు నెటిజెన్స్.




