Jailer02: జైలర్ 2 లో విలన్ గా.. టాలీవుడ్ ఆ స్టార్ హీరో..
అదర్ దేన్ టాలీవుడ్ నాగార్జున వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తున్నారా? మరీ ముఖ్యంగా తమిళనాడు మీద ఫోకస్ చేస్తున్నారా? మన కింగ్‌కి కోలీవుడ్‌లో కంఫర్ట్ లెవల్స్ బావున్నాయా? ఇలాంటి డిస్కషనే షురూ అవుతోంది కోడంబాక్కంలో. ఇంతకీ ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు వచ్చినట్టు..? నా చిన్నతనం నుంచి నాగార్జున నటనను చూస్తూనే ఉన్నా.
Updated on: May 29, 2025 | 11:57 AM

నా చిన్నతనం నుంచి నాగార్జున నటనను చూస్తూనే ఉన్నా. ఆయనతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది అని ధనుష్ చెప్పిన మాటలు చెన్నై సందుల్లో రీసౌండ్ అవుతున్నాయి. కింగ్‌తో కలిసి ధనుష్ చేసిన కుబేర కోసం వెయిటింగ్ అంటున్నారు యూత్

అటు రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా కూలీ మూవీ కోసం కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు. కూలీలో ప్రామినెంట్ రోల్‌లో కనిపిస్తారు నాగార్జున. కూలీలో ఆయనది జస్ట్ గెస్ట్ అప్పియరెన్స్ కాదు, సైమన్ కేరక్టర్‌ని చాలా బాగా డిజైన్ చేశామని చెప్పేశారు లోకేష్.

కూలీ తర్వాత జైలర్ సీక్వెల్‌కి మూవ్ అయ్యారు రజనీకాంత్. జస్ట్ ఆయన వెళ్లడమే కాదు, ఆ సెట్స్ కి నాగ్‌ని కూడా తీసుకెళ్తారన్నది ఇప్పుడు టాక్. జైలర్ 2లో మెయిన్ విలన్ కేరక్టర్ కోసం నాగార్జునను సంప్రదిస్తున్నారట మేకర్స్.

జైలర్ సీక్వెల్‌లో కింగ్ విలన్ రోల్‌ని యాక్సెప్ట్ చేస్తే సిల్వర్ స్క్రీన్ దద్దరిల్లిపోవడం గ్యారంటీ అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఆల్రెడీ బాలీవుడ్‌లో బ్రహ్మాస్త్రతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.

ఇప్పుడు ధనుష్, రజనీ సినిమాలతో కొలాబరేట్ అవుతున్నారు. రియల్ ప్యాన్ ఇండియా స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు మా కింగ్ అని పొంగిపోతున్నారు ఫ్యాన్స్.




