Mirai: మిరాయ్ టీజర్ రిలీజ్.. తేజ సజ్జాకు మరొక హిట్ పక్కా అంటున్న ఫ్యాన్స్
సమాధానం కోసం బయట కాదు... లోపల వెతుకు అంటూ మిరాయ్ టీజర్ రిలీజ్ అయింది. ఇంతకీ టీజర్ ఎలా ఉంది? హనుమాన్ సక్సెస్‌ని మిరాయ్ కంటిన్యూ చేస్తుందా? తేజ సజ్జా ఈ సారి ఏం ప్లాన్ చేస్తున్నారు? కమాన్ లెట్స్ వాచ్.. అన్నీ అనుకున్నట్టే జరిగి ఉంటే, ఈ సమ్మర్‌కి రిలీజ్ కావాల్సింది మిరాయ్.
Updated on: May 29, 2025 | 12:05 PM

సమాధానం కోసం బయట కాదు... లోపల వెతుకు అంటూ మిరాయ్ టీజర్ రిలీజ్ అయింది. ఇంతకీ టీజర్ ఎలా ఉంది? హనుమాన్ సక్సెస్‌ని మిరాయ్ కంటిన్యూ చేస్తుందా? తేజ సజ్జా ఈ సారి ఏం ప్లాన్ చేస్తున్నారు? కమాన్ లెట్స్ వాచ్..

అన్నీ అనుకున్నట్టే జరిగి ఉంటే, ఈ సమ్మర్‌కి రిలీజ్ కావాల్సింది మిరాయ్. ఫస్ట్ అనౌన్స్ చేసిన టైమ్‌కి సినిమాను తీసుకురాలేకపోయాం.. అందుకే టీజర్‌తో ప్రేక్షకుల్ని పలకరిస్తున్నామంటూ రిలీజ్ చేశారు మేకర్స్.

లాస్ట్ సంక్రాంతికి భారీ సినిమాల మధ్య హనుమాన్‌ని రిలీజ్ చేసినప్పుడు ఈ గట్స్ ఏంటని అందరూ అనుకున్నారు. అయినా, కొట్టి చూపించింది మూవీ.

కథలో వెరైటీ కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారని ప్రూవ్ చేసింది. అలాంటి వెరైటీ కంటెంట్‌తోనే ఈ సారి మిరాయ్ చేస్తున్నారు తేజ సజ్జా.

అశోకుడి గురించి, తొమ్మిది గ్రంథాల గురించి టీజర్‌లో వినిపించే డైలాగులు కంటెంట్ మీద ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సినిమా రిలీజ్‌కి దగ్గర పడేకొద్దీ కనిపించే కంటెంట్ ఇంతకెంత ఆకట్టుకుంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.




