AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Single Movie: శ్రీ విష్ణు ‘సింగిల్‌’ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా? అయ్యో .. హిట్ ట్రాక్ ఎక్కేవాడుగా

శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా సింగిల్. ఇటీవలే థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. అయితే ఈ సూపర్ హిట్ సినిమాను మన టాలీవుడ్ లో ఒక హీరో మిస్ చేసుకున్నాడట.

Single Movie: శ్రీ విష్ణు 'సింగిల్‌' సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా? అయ్యో .. హిట్ ట్రాక్ ఎక్కేవాడుగా
Single Movie
Basha Shek
|

Updated on: May 28, 2025 | 4:59 PM

Share

యంగ్ హీరో శ్రీ విష్ణు ఖాతాలో మరో సూపర్ హిట్ పడింది. అతను నటించిన తాజా సినిమా సింగిల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. శ్రీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా సింగిల్ మూవీ నిలిచింది. డైరెక్టర్ కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలోతికా శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు. గీతా ఆర్ట్స్, కాల్య ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సింగిల్ సినిమాను నిర్మించారు. వీటీవీ గణేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రభాస్ శ్రీను, సత్య, రెబా మోనికా జాన్, మానస చౌదరి తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూర్చారు. మే 09న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. శ్రీవిష్ణు, కేతిక, ఇవానా మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. అలాగే వెన్నెల కిశోర్ కామెడీ కూడా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద సింగిల్ సినిమాకు భారీ వసూళ్లు రాబట్టాయి. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సింగిల్ సినిమా రూ. 25 కోట్ల కు పైగానే కలెక్ట్ చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ సినిమాతో కెరీర్ పరంగా మరో మెట్టు పైకెక్కాడు శ్రీ విష్ణు. అయితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాని మన టాలీవుడ్ లో ఒక హీరో మిస్ చేసుకున్నాడట.

ఇవి కూడా చదవండి

అవును.. సింగిల్ సినిమాలో హీరోగా మొదట శ్రీ విష్ణును అనుకోలేదట డైరెక్టర్ కార్తీక్ రాజు. అతను ఈ సినిమా కథను యూత్ స్టార్ నితిన్ కు వినిపించాడట. కథ విని చాలా బాగుందన్న నితిన్.. ఇప్పుడు తాను కొన్ని సినిమాలకు కమిట్ అయ్యాను, అవి పూర్తి అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందని అన్నాడట. డైరెక్టర్ కూడా అందుకు అంగీకరించి ఏడాది వరకు ఎదురు చూశాడట. అయితే నితిన్ నుంచి ఎలాంటి కాల్ రాలేదట. దీంతో ఈ కథ ను బన్నీ వాసు కి వినిపించాడు. ఆయన వెంటనే అల్లు అరవింద్ తో మాట్లాడి ఈ స్టోరీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించేందుకు అగ్రీమెంట్ చేసుకుంటున్నాడట. ఆ తర్వాత హీరోగా శ్రీ విష్ణు లైన్ లోకి వచ్చాడట. అలా మొత్తానికి సింగిల్ సినిమా పట్టాలెక్కిందట. ఒక వేళ నితిన్ సింగిల్ సినిమాను చేసి ఉంటే బాగుండేదేమో? అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్