Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్.. ఎంతలా మారిపోయింది!

కింది ఫొటోలో సర్కిల్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఇటీవల ఈ బ్యూటీ నటించిన ఒక సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్.. ఎంతలా మారిపోయింది!
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Nov 02, 2024 | 9:14 AM

టాలీవుడ్ లో సత్తా చాటుతోన్న మలయాళ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా ఈ జాబితాకు చెందినదే. బాలనటిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ క్యూటీ తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. పేరుకు మలయాళీ అయినా తెలుగులోనే ఈ అందాల తారకు క్రేజ్ ఎక్కువ. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని తదిదర స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె నటించిన ఒక సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆమె నటన నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు పక్కింటి అమ్మాయి పాత్రల్లో నటించిన ఈ అందాల తార తొలిసారిగా అమ్మ పాత్రలో అద్భుతంగా నటించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈ క్యూటీ మరెవరో కాదు ఇటీవల 35 చిన్న కథ కాదు సినిమాతో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకున్న నివేదా థామస్. శనివారం (నవంబర్ 02) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నివేదాకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

1995 నవంబర్ 2న కన్నూర్ ప్రాంతంలో జన్మించిన నివేదా.. 2002లో మలయాళం మూవీ ‘ఉత్తర’లో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సన్ టీవీలో అప్పట్లో ప్రసారమైన మై డియర్ భూతం సీరియల్లోనూ నివేద నటించింది. ఆ తర్వాత తమిళ్, మలయాళంలో అనేక చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది. 2016లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా, దర్బార్, వి, వకీల్ సాబ్, మీట్ క్యూట్, శాకిని డాకిని చిత్రాలతో తెలుగు ఆడియెన్స కు బాగా చేరువైంది.

ఇవి కూడా చదవండి

35.. చిన్న కథ కాదు సినిమాలో నివేదా థామస్..

నివేద నటించిన తాజా చిత్రం 35.. చిన్న కథ కాదు. కమర్షియల్ హంగులకు దూరంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. పిల్లల చదువులో తల్లిదండ్రుల పాత్ర అనే సున్నితమైన అంశంపై ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో తల్లిగా నివేద పాత్రకు పలువురి ప్రశంసలు దక్కాయి.

ఆహలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!