AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. సినిమా కోసం ప్రాణం పెడతాడు

సినిమా ఇండస్ట్రీ నేపథ్యమున్న కుటుంబం నుంచే వచ్చాడీ హ్యాండ్సమ్ హీరో. కానీ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతను క్రమ క్రమంగా క్రేజీ హీరోగా మారిపోయాడు

Tollywood: అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. సినిమా కోసం ప్రాణం పెడతాడు
Tollywood Actor
Basha Shek
|

Updated on: May 07, 2025 | 8:49 AM

Share

పై ఫొటోలో చిన్నప్పుడే కెమెరా పట్టుకుని పోజులిస్తోన్నబుడతడిని గుర్తు పట్టారా? సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారు మాత్రమే ఈ పిల్లాడిని గుర్తు పట్టే అవకాశం ఉంది. మిగతా వాళ్లకు నో ఛాన్స్. ఈ బుడతడు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. లవ్, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని జానర్ల సినిమాలతోనూ తెలుగు ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఓ వైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఎలాంటి భేషజాలు లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తుంటాడీ ట్యాలెంటెడ్ హీరో. సినిమా అంటే పడి చచ్చే ఈ హీరో తన పాత్ర బాగా రావడానికి ఎంతటి రిస్క్‌కైనా సై అంటాడు. సిక్స్‌ ప్యాక్‌, ఎయిట్‌ ప్యాక్‌ తన దేహాన్ని బాగా కష్టపెడుతుంటాడు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తోన్న ఈ ట్యాలెంటెడ్ హీరోను గుర్తు పట్టారా మరి? కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. అతను మరెవరో కాదు సందీప్ కిషన్. ఇవాళ (మే 07) అతని పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ట్యాలెంటెడ్ హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే సందర్భంగా సందీప్ కిషన్ చిన్ననాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

గతేడాది ఏకంగా మూడు సినిమాల్లో నటించాడు సందీప్ కిషన్. ఊరు పేరు భైరవ కోనతో సోలో హీరోగా హిట్ కొట్టాడు. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి కెప్టెన్ మిల్లర్, రాయన్ సినిమాలతో మరో రెండు విజయాలు సొంతం చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది మజాకా అనే సినిమాతో మన ముందుకువచ్చాడు సందీప్. ఈ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది.

మజాకా సినిమాలో సందీప్ కిషన్..

ప్రస్తుతం వైబ్ అనే సినిమాలో నటిస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. అలాగే సూపర్ సుబ్బు అనే వెబ్ సిరీస్ లోనూ యాక్ట్ చేస్తున్నాడు.

సందీప్ కిషన్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.