AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సీరియల్స్‏లో పద్దతిగా.. బయట వయ్యారంగా.. నెట్టింట గత్తరలేపుతోన్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ?

బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. నిజానికి సినిమాల్లో కనిపించిన సెలబ్రెటీల కంటే సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటీనటులు చాలా మంది ఉన్నారు. తెలుగులో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యాక్టర్స్ ఎంతో మంది. కానీ ఈ బ్యూటీ గురించి మీకు తెలుసా.. ?

Tollywood: సీరియల్స్‏లో పద్దతిగా.. బయట వయ్యారంగా.. నెట్టింట గత్తరలేపుతోన్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ?
Jyotirai
Rajitha Chanti
|

Updated on: May 07, 2025 | 8:16 AM

Share

బుల్లితెరపై ఆమెకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పద్దతిగా, సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూ తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. సౌమ్యంగా కనిపిస్తూనే.. అద్భుతమైన యాక్టింగ్‏లో సీరియల్ ప్రియులను ఆకట్టుకుంది. చీరకట్టులో.. అచ్చమైన తెలుగింటి ఆడపడుచుగా కనిపించిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతోంది. ప్రస్తుతం సీరియల్స్ గుడ్ బై చెప్పేసి సినిమాల్లో అదృష్టం పరీక్షిస్తుంది. ఇప్పుడు హీరోయిన్‏గా వెండితెరపై సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. తాజాగా ఈ అమ్మడు గ్లామరస్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న బ్యూటీ బుల్లితెరపై చాలా ఫేమస్. అంతేకాదు.. తెలుగు సీరియల్ ప్రియులకు ఇష్టమైన నటి. ఇంతకీ ఆమె మరెవరో కాదు.. గుప్పెడంత మనసు ఫేమ్ జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్. ఇప్పుడు కథానాయికగా రాణిస్తుంది.

జ్యోతిరాయ్.. తెలుగు బుల్లితెర ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. తెలుగులో టాప్ టీఆర్పీతో దూసుకుపోయిన గుప్పడెంత మనసు సీరియల్లో జగతి మేడమ్ పాత్రలో కనిపించింది. కొడుకు ప్రేమ కోసం తల్లడిల్లే తల్లిగా.. స్టూడెంట్ భవిష్యత్తు కోసం పోరాడే లెక్చరర్ పాత్రలో అద్భుతమైన పాత్రలో కట్టిపడేసింది. ఈ సీరియల్లో కాటన్ చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించి సహజ నటనతో మెప్పించింది. జగతి మేడమ్ పాత్రలో కనిపించిన జ్యోతిరాయ్.. ఆ తర్వాత మాత్రం సీరియల్ నుంచి తప్పుకుంది. కట్ చేస్తే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. బుల్లితెరపై చీరకట్టులో కనిపించిన ఈ అమ్మడు.. నెట్టింట మాత్రం గ్లామరస్ ఫోటోషూట్లతో అరాచకం సృష్టించింది.

సోషల్ మీడియాలో జ్యోతిరాయ్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లు పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు నెట్టింట మాత్రమే అందాలతో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఆమె కిల్లర్ అనే సినిమాలో నటిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో జ్యోతిరాయ్ పవర్ ఫుల్ యాక్టింగ్ తో అదరగొట్టేసింది. త్వరలోనే వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది జ్యోతిరాయ్.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

Follow Us
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు