Tollywood: క్యూట్ అమ్మాయి ఒకప్పుడు తెలుగు అడియన్స్ ఫేవరేట్.. ఇప్పుడు సినిమాలకు దూరం.. ఎవరో గుర్తుపట్టండి..
వరుసగా స్టార్ హీరోస్ సరసన ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. రామ్ చరణ్, అక్కినేని నాగచైతన్య, అఖిల్, ఎన్టీఆర్, ప్రభాస్ జోడిగా నటించి మెప్పించింది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం ఒక్క సినిమా కూడా చేతిలో లేకుండా ఖాళీగా ఉంది. కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అవుతున్నాయి. దీంతో ఈ బ్యూటీకి మెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి.

క్యూట్ లుక్స్ ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ?.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమ్మాయి. తొలి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోస్ సరసన ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. రామ్ చరణ్, అక్కినేని నాగచైతన్య, అఖిల్, ఎన్టీఆర్, ప్రభాస్ జోడిగా నటించి మెప్పించింది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం ఒక్క సినిమా కూడా చేతిలో లేకుండా ఖాళీగా ఉంది. కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అవుతున్నాయి. దీంతో ఈ బ్యూటీకి మెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. అలాగే ఇప్పటికే ఆమె ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకుంది. మరోవైపు బాలీవుడ్ లోనూ మరిన్ని అవకాశాలు అందుకుంటుంది. కానీ అక్కడా నిరాశే ఎదురైంది. ఇప్పుడు గుర్తుపట్టే ఉంటారు కదా. తనే టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.
రేపు (అక్టోబర్ 13)న పూజా హెగ్డే పుట్టినరోజు. 1990లో ముంబైలో జన్మించింది పూజా. 2014లో ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించారు. అదే ఏడాది వరుణ్ తేజ్ జోడిగా ముకుంద సినిమాలో నటించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలలో నటించి అలరించింది.
View this post on Instagram
అయితే అల వైకుంఠపురంలో సినిమా తర్వాత పూజా నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఏడాది క్రితం రాధేశ్యామ్ సినిమాలో నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇటీవలే హిందీలో కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో నటించినప్పటికీ అక్కడ నిరాశే ఎదురైంది. ఇక ఇప్పటివరకు పూజా హెగ్డే దాదాపు రూ.51 కోట్ల ఆస్తులు సంపాదించింది. అలాగే ఆమె వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. పూజాకి హైదరాబాద్, ముంబైలో విలాసవంతమైన ఇళ్లులు ఉన్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.