Tollywood: ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు స్టార్స్‌ను గుర్తుపట్టారా ?.. ఒకరు పాన్ ఇండియా.. ఇంకొకరు సౌత్ స్టార్..
సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అలాంటివారు ఒకప్పుడు చిన్న చిన్న గదులలో అద్దెకు ఉంటూ తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్స్ అలాంటి అనుభవాలను ఎదుర్కొన్నవారే. ఇప్పుడు ఆ స్టార్లకు సంబంధించిన అలనాటి జ్ఞాపకాలు నెట్టింట వైరలవుతున్నాయి. అందులో ఈ ఫోటో కూడా ఒకటి. పైన ఫోటోను చూశారు కదా. అందులో ఉన్న ఇద్దరు స్టార్ నటులే. ఒకరు పాన్ ఇండియా సూపర్ స్టార్. మరొకరు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్.

సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన అనేక విషయాలు వైరలవుతుంటాయి. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అలాంటివారు ఒకప్పుడు చిన్న చిన్న గదులలో అద్దెకు ఉంటూ తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్స్ అలాంటి అనుభవాలను ఎదుర్కొన్నవారే. ఇప్పుడు ఆ స్టార్లకు సంబంధించిన అలనాటి జ్ఞాపకాలు నెట్టింట వైరలవుతున్నాయి. అందులో ఈ ఫోటో కూడా ఒకటి. పైన ఫోటోను చూశారు కదా. అందులో ఉన్న ఇద్దరు స్టార్ నటులే. ఒకరు పాన్ ఇండియా సూపర్ స్టార్. మరొకరు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్.
ఆ ఇద్దరు ఎవరంటే.. ఒకరు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి.. మరోకరు అట్టకత్తి సినిమాతో పాపులారిటీ అందుకున్న దినేష్. ఈ ఫోటో 2009 అక్టోబర్ 9న తీసిన ఫోటో. దాదాపు 14 ఏళ్ల క్రితం అట్టకత్తి దినేష్ బర్త్ డే సందర్భంగా తీసిన ఫోటో అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు తమిళ నటుడు రియాజ్. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. వీరిద్దరు కలిసి ఒకేసారి సినీ ప్రయాణం మొదలు పెట్టారు. 2012లో సుందరపాండియన్ సినిమాతో విజయ్ సేతుపతికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. హీరోగా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే తెలుగులో ఉప్పెన సినిమాతో విలన్ గా కనిపించారు. ఈ మూవీతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతికి అవకాశాలు క్యూకట్టాయి. ఇటీవలే జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
My Phone Click..14 Years Back on my Birthday (09-09-2009)#VijaySethupathi #Dinesh 🤩 pic.twitter.com/0hp2KTFvUU
— Riyaz A (@Riyaz_Ctc) October 3, 2023
ఇక దినేష్.. 2012లో విడుదలైన అట్టకత్తి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తిరుడాన్ పోలీస్, ఇందిర, తిమిళనుకు ప్రెస్ నెంబర్ 1, కబాలి చిత్రాల్లో నటించి తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.