Tollywood: దిగ్గజ నటుడి చేతిలో ఉన్న ఆ కుర్రాడు ఇప్పుడు స్టార్ హీరో.. పాన్ ఇండియా స్టార్.. సాహసాలకు కేరాఫ్ అడ్రస్..
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న బడా హీరోలలో ఒకరు. ఆయన నటనకు ప్రపంచమే ఫిదా అయిపోతుంది. సినిమా కోసం ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.
అలనాటి దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ చేతిలో ఉన్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టండి. ఇప్పుడు ఈ చిన్నోడు అగ్రకథానాయకుడు. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న బడా హీరోలలో ఒకరు. ఆయన నటనకు ప్రపంచమే ఫిదా అయిపోతుంది. సినిమా కోసం ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం అతని వయసు 68 సంవత్సరాలు . అయినా వరుస చిత్రాలతో కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు. ఎవరో గుర్తుపట్టండి. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. (నవంబర్ 7) ఈ స్టార్ హీరో పుట్టినరోజు. ఎవరో గుర్తుపట్టండి.
ఆ కుర్రాడు మరెవరో కాదండి.. లోకనాయకుడు కమల్ హాసన్. నటనతో ఆయన చేసిన ప్రయోగాలు అనేకం. పదో తరగతి కూడా చదవని వ్యక్తి ఈరోజు ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగారు. 1954లో తమిళనాడులోని రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడి ప్రాంతంలో జన్మించిన కమల్.. బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. మొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత జాతీయ ఉత్తమ నటుడిగా మూడుసార్లు అవార్డ్ అందుకున్నారు. కేవలం నటుడిగానే కాదు. క్లాసికల్ డ్యాన్స్.. సంగీతంలోనూ ప్రతిభ ఉన్నవారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన శ్రీమంతడు చిత్రంతో డాన్స్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత స్క్రీన్ ప్లే రాయడం పై ఆసక్తి పెంచుకున్నారు. అటు డాన్స్ కొరియోగ్రఫీ… ఇటు రైటింగ్ స్కిల్ ఉడండంతో ఇండస్ట్రీలో డైరెక్టర్ కావాలనుకున్నారట.
డైరెక్టర్ కె. బాలచందర్ సూచించడంతో నటనవైపు అడుగులు వేసిన కమల్.. అరంగేట్రమ్ సినిమాతో కథానాయికుడిగా పరిచయమయ్యారు. వీరిద్దరి కాంబోలో దాదాపు 35కి పైగా సినిమాలు వచ్చాయి. ఆకలి రాజ్యం, భారతీయుడు, నాయకుడు, సాగర సంగమం, దశావతారం, విశ్వరూపం 2 సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. చాలా కాలం తర్వాత కమల్ నటించిన విక్రమ్ సినిమా ఇటీవలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఆయన ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.