Kamal Haasan: ఇక మొదలెడదామా? కమల్‌కు జోష్ ఇచ్చిన విక్రమ్.. భారీ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్!
2013లో విడుదలైన విశ్వరూపం సినిమానే కమల్‌కు బిగ్గెస్ట్ హిట్. 2014లో ఎలాంటి సినిమాలు చేయలేదు. 2015లో ఉత్తమ విలన్, పాపనాశం, తూంగవనం అనే సినిమాలు చేసినా అవి ఆయన స్థాయికి తగినవి కావు. ఇక 2018లో రిలీజైన విశ్వరూపం కూడా పెద్దగా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది.
అది 2018.. కోలీవుడ్‌లో విజయ్, సూర్య లాంటి హీరోలు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్నారు. అజిత్, రజనీకాంత్ లాంటి సీనియర్ హీరోలు కూడా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. అదే సమయంలో లోకనాయకుడిగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ మాత్రం మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. దీంతో ఆయన సినిమా కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లేనని చాలామంది భావించారు. అందుకు తగ్గట్లే పార్టీ స్థాపించక ముందు, తర్వాత ఆయనకు పెద్దగా హిట్లు లేవు. 2013లో విడుదలైన విశ్వరూపం సినిమానే కమల్‌కు బిగ్గెస్ట్ హిట్. 2014లో ఎలాంటి సినిమాలు చేయలేదు. 2015లో ఉత్తమ విలన్, పాపనాశం, తూంగవనం అనే సినిమాలు చేసినా అవి ఆయన స్థాయికి తగినవి కావు. ఇక 2018లో రిలీజైన విశ్వరూపం కూడా పెద్దగా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ఆ సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీంతో సిల్వర్ స్ర్కీన్‌పై కమల్ కనిపించడం కల్లేనని భావించారు చాలామంది. కానీ సీన్ కట్ చేస్తే.. 2022లో విక్రమ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు కమల్. 67 వయసులో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి నటన తన రక్తంలోనే ఉందని మరోసారి నిరూపించారు.
2018లో విశ్వరూపం 2 సినిమాలో కనిపించిన కమల్ ఆ తర్వాత సిల్వర్ స్ర్కీన్‌పై కనిపించలేదు. రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. బిగ్‌బాస్ తమిళ్ హోస్ట్‌గా మాత్రమే ప్రేక్షకులను అలరించాడు. అందుకే లోకేశ్ కనగరాజ్‌తో విక్రమ్ ప్రకటించగానే ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. హిట్ అవుతుందా? లేదా? అని కమల్ అభిమానుల్లో ఎక్కడో అనుమానం. కానీ జూన్3న ఈ అనుమానాలు, సందేహాలన్నీ తొలగిపోయాయి. విక్రమ్ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 420 కోట్లకు పైగా వసూలు చేసిం తమిళ చిత్రసీమలో ఆల్ టైమ్ బాక్సాఫీస్ హిట్లలో ఒకటిగా నిలిచింది. థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ రికార్డులు సృష్టించాడు విక్రమ్. ఈ సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో ఆగిపోయిందనుకున్న ఇండియన్2 (భారతీయుడు సీక్వెల్) సినిమను మళ్లీ మొదలుపెట్టారు కమల్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ కానుంది. ఇక తాజాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో మరో సినిమాను అనౌన్స్ చేశాడాయన. ఇది కమల్‌కు 234వ సినిమా. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్, రెడ్ జియాంట్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్వర మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..