AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram Srinivas: త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ ఎందుకు అమాయకంగా ఉంటారో తెల్సా ? రీజన్ ఇదే..

ఓ ప్రేమికుడు ఎలా ఉండాలి ?.. కొడుకుకు తండ్రి విలువలు కాపాడాల్సిన అవసరం ఏంటీ ? అనేది ఈతరం ప్రేక్షకుడి మనసును ఆకట్టుకునే విధంగా చెప్పేస్తాడు. తన సినిమాలతో ప్రజలను అలరిస్తాడు.. నవ్విస్తాడు.. ఆలోచింపచేస్తాడు.. ఏడిపిస్తాడు.. త్రివిక్రమ్

Trivikram Srinivas: త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ ఎందుకు అమాయకంగా ఉంటారో తెల్సా ? రీజన్ ఇదే..
Trivikram
Rajitha Chanti
|

Updated on: Nov 07, 2022 | 1:16 PM

Share

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. వాస్తవమే.. అతను మాట్లాడితే వింటూనే ఉంటారు. తన మాటలతో ప్రతి ఒక్కరిని ముగ్దులను చేయండంలో ఆయనకు ఆయనే సాటి. ఓ సామాన్యుడి జీవితాన్ని.. అతని ఆలోచన విధానాన్ని.. ఎంతో అందంగా తన మాటల్లో వివరిస్తారు. ఆయన తెరకెక్కించే చిత్రాలు ప్రతి ప్రేక్షకుడిని ఆలోచించేలా చేస్తాయి. త్రివిక్రమ్ మాటల్లోనే పరాక్రమం.. ప్రేమ.. అప్యాయత కలబోసి ఉంటాయి. ఎంతంటి కఠిన పరిస్థితినైనా..మాటలతో సున్నితంగా చెప్పేస్తాడు. ఓ ప్రేమికుడు ఎలా ఉండాలి ?.. కొడుకుకు తండ్రి విలువలు కాపాడాల్సిన అవసరం ఏంటీ ? అనేది ఈతరం ప్రేక్షకుడి మనసును ఆకట్టుకునే విధంగా చెప్పేస్తాడు. తన సినిమాలతో ప్రజలను అలరిస్తాడు.. నవ్విస్తాడు.. ఆలోచింపచేస్తాడు.. ఏడిపిస్తాడు.. త్రివిక్రమ్ రాసే మాటలకు అడిక్ట్ కానివారండరు. అయితే ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించారు త్రివిక్రమ్. నువ్వే నువ్వే నుంచి..అలా వైకుంఠపురంలో వరకు ప్రతి సినిమా ప్రత్యేకమే. కానీ ఒకటి గమనించారా ?.. త్రివిక్రమ్ ప్రతి సినిమాలోని హీరోయిన్స్ ఎంతో అమాయకంగా..తింగరిగా ఉంటారు.

నువ్వే నువ్వే చిత్రంలో శ్రియా ఎంతో అమాయకంగా కనిపిస్తూనే .. అంతలోనే ఎంతో తెలివైన అమ్మాయిగా ఉంటారు. ఇలా ఎందుకు అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. గతంలో ఓ ఇంటర్యూలో తన సినిమా హీరోయిన్స్ రోల్స్ గురించి స్పందించారు త్రివిక్రమ్. మీరు తెరకెక్కించే సినిమాల్లో హ హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఎందుకు అమాయకంగా చూపిస్తారు అని అడగ్గా.. త్రివిక్రమ్ స్పందించారు. ” బహుశా నేను పెరిగిన వాతావరణం గానీ.. నేను పెరిగిన వాతావరణం గానీ.. చూసిన స్త్రీలు గానీ కావచ్చు. ప్రస్తుతం జీవన విధానం మార్పులను బట్టి మనం ఓ శక్తివంతమైన మహిళను కోరుకుంటున్నాం. ఒకానొక కాలంలో చాలా సంవత్సరాలకు ఝాన్సీ లక్ష్మీ బాయ్ మరణించింది. మళ్లీ వంద సంవత్సరాల తర్వాత ఓ రుద్రమదేవి. తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసినవారే. కానీ ఇప్పుడు పరిస్థతులు ఆ విధంగా లేవు. ప్రేమించిన అమ్మాయిలపై యాసిడ్ పోయడం.. చంపేయం జరుగుతున్నాయి. నేను పెరిగిన వాతావరణంలో గానీ.. నా చుట్టుపక్కల ఉన్న అక్కచెల్లె్లు.. స్త్రీలను ఇంత భయంకరమైన పరిస్థితులలో చూడలేదు.

ఇవి కూడా చదవండి

నేను చూసిన పరిస్థితులను బట్టి స్త్రీలు అమాయకంగా.. తండ్రిచాటు బిడ్డలాగా ఉండటమే నాకు కనిపిస్తుంది. అదే విధంగా నేను నా సినిమాలో స్త్రీ పాత్ర రూపొందిస్తున్నాను. మారుతున్న ప్రపంచంతో పాటు నేను కూడా మారుతున్నానేమో..అందుకే అలా క్రియేట్ చేస్తున్నానేమో.. అది నా యుటోపియన్ వరల్డ్ కావచ్చు. కానీ ఇప్పుడు అలా ఎవరు లేరు ” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టా్ర్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..