Ajay Ghosh: ఆ కారణంతోనే ఆచార్యలో నటించలేదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన అజయ్ ఘోష్..
పవర్ ఫుల్ విలన్ పాత్రల్లో కనిపిస్తూనే.. మరోవైపు తనదైన శైలీలో కామెడీని పండిస్తూ.. హాస్యనటుడిగానూ అలరించారు. తాజాగా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో విలన్ కొండారెడ్డిగా నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు నటుడు అజయ్ ఘోష్. ప్రస్థానం సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన జ్యోతిలక్ష్మి మూవీలో ప్రతినాయకుడిగా కనిపించారు. ఆ తర్వాత రంగస్థలం, రాజు గారి గది 3 వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషల్లోనూ అవకాశాలు అందుకున్నారు. ఓవైపు పవర్ ఫుల్ విలన్ పాత్రల్లో కనిపిస్తూనే.. మరోవైపు తనదైన శైలీలో కామెడీని పండిస్తూ.. హాస్యనటుడిగానూ అలరించారు. తాజాగా చెప్పాలని ఉంది కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత.. సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
నటనపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చిన అజయ్… ముందు పలు సీరియల్స్ లో నటించేవారు. ఆ సమయంలో సినిమాల్లోకి వెళ్లమని కొందరు సలహాలు ఇవ్వడంతో.. సినీ అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని.. అందరూ చూద్దామనేవారని.. కొద్దిరోజులకు దేవా కట్టా ప్రస్థానంలో అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈ సినిమాలోని గౌడ్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నారు.
” పూరీ జగన్నాథ్ తెరకెక్కించి జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత నటన పరంగా అందరూ పొగిడిన అవకశాలు రాలేదు. సంవత్సరం ఎదురుచూసిన ఎవరు పిలవలేదు. దీంతో మాములు పనులకు వెళ్లేవాడిని. నాకు తెలిసిన వ్యక్తి నాతో మాట్లాడుతూ..అవకాశాలు రావట్లేదని బాధపడకు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే దర్శకులు నీకు కచ్చితంగా ప్రాత్రలు ఇస్తారని చెప్పారు. అలాగే జరిగింది. నాకు ఇప్పటివరకు వచ్చిన పాత్రలు దాదాపు కొత్త దర్శకులవే. కొరటాల శివ గారు ఆచార్య సినిమాలో విలన్ పాత్ర కోసం పిలిచారు. కానీ నాకు ఆ సమయంలో ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల చేయలేకపోయాను” అంటూ చెప్పుకొచ్చారు అజయ్.