Tollywood: మేడమ్ సార్ మేడమ్ అంతే! 59 ఏళ్ల వయసులోనూ వర్కౌట్స్ చేస్తోన్న ఈ టాలీవుడ్ నటిని గుర్తు పట్టారా? వీడియో
వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు అందరూ జిమ్ ల బాట పడుతున్నారు. కఠినమైన వర్కవుట్లు, వ్యాయామాలు చేస్తున్నారు. ఆరోగ్యంతో పాటు తమ బాడీని ఫిట్ గా ఉంచుకుంటున్నారు. అలా 59 ఏళ్ల ఓ టాలీవుడ్ నటి కూడా జిమ్ లో కఠినమైన వర్కవుట్లు చేస్తూ కనిపించింది.

పై ఫొటోలో కనిపిస్తోన్న టాలీవుడ్ నటిని గుర్తు పట్టారా? గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు సహాయక నటి పాత్రల్లో మెరుస్తున్నారు. హీరో, హీరోయిన్లకు అమ్మగా, అత్తగా, అక్కగా, వదినగా నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లోనూ మెరుస్తోన్న ఈ అందాల తార వయసు ఇప్పుడు సుమారు 59 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ ఎంతో అందంగా, ఫిట్ గా కనిపిస్తుంది. దానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏజ్‌లో కూడా ఆమె జిమ్‌లో చెమటలు చిందిస్తోంది. చిన్నపాటి వ్యాయామాలే కాకుండా డంబుల్స్ ఎత్తడం లాంటి కష్టమైన వర్కవుట్స్ కూడా సులభంగా చేస్తోంది. మరి ఇంతకీ ఆ ఫేమస్ నటి ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు అత్తారింటికి దారేది ఫేమ్ నదియా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే ఈ మధ్యన తన జిమ్ వర్కౌట్స్ వీడియోలను కూడా పంచుకుంటోంది. అలా తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న మరో వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది నదియా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ‘మీరు చాలా గ్రేట్ మేడమ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
1984లో వచ్చిన నూకెత్త దూరతు కన్నుం నట్టు అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నదియా. మొదటి మూవీతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ పురస్కారం అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోలతో కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక మిర్చి సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె అత్తారింటికి దారేది, దృశ్యం, దృశ్యం 2, నా పేరు సూర్య, అఆ, అంటే సుందరానికి, వరుడు కావలేను, సర్కారు వారి పాట, ది వారియర్, ఎల్జీఎమ్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో సహాయక నటిగా మెప్పించింది. నదియా చివరిగా గతేడాది ఓటీటీలో వచ్చిన మనోరతంగల్ అనే ఓ వెబ్ సిరీస్ లో కనిపించింది.
జిమ్ లో వర్కౌట్స్ చేస్తోన్న నదియా.. వీడియో..
View this post on Instagram
నదియా లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








