Nayanthara: ‘ఇప్పుడే మంచి రోజులు మొదలయ్యాయి’.. నయనతార ఇన్‌స్టా పోస్ట్ అందుకేనా..
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఫుల్ జోషలో ఉంది. ఆమె బాలీవుడ్‌లో మొదటిసారిగా నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమా ఇప్పటికే రూ. 650 కోట్లు రాబట్టింది. జవాన్ జోరు చూస్తుంటే త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. జవాన్ సినిమాలో నర్మద అనే పోలీసాఫీసర్ పాత్రలో నటించింది నయనతార.
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఫుల్ జోషలో ఉంది. ఆమె బాలీవుడ్‌లో మొదటిసారిగా నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమా ఇప్పటికే రూ. 650 కోట్లు రాబట్టింది. జవాన్ జోరు చూస్తుంటే త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. జవాన్ సినిమాలో నర్మద అనే పోలీసాఫీసర్ పాత్రలో నటించింది నయనతార. గ్లామర్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లోనూ అదరగొట్టిందీ అందాల తార. ప్రస్తుతం జవాన్ సక్సెస్ జోష్‌లో ఉన్న నయన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొత్త పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన భర్త విఘ్నేశ్ శివన్ ధరించిన టీ షర్ట్‌పై ‘మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి..’ అని రాసి ఉన్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. నయనతార పోస్ట్‌కు అర్థమేంటబ్బా అని అభిమానులు, నెటిజన్లు ఆలోచనలో పడిపోయారు. అయితే గతేడాది విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకోవడం, ఇద్దరి పిల్లలకు అమ్మకావడం, బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇవ్వడం.. మరిన్ని క్రేజీ ఆఫర్లు రావడంతో.. ఇలా నయన్ లైఫ్‌లో అన్నీ శుభశకునాలే ఉన్నాయని.. ఈ కోణంలోనే ఆమె పోస్ట్ పెట్టిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కాగా దక్షిణాదిలో అత్యధిక పారితోషకం అందుకుంటోన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు 8-10 కోట్లు తీసుకుంటోందని తెలుస్తోంది. ఇక ‘జవాన్’ చిత్రానికి రూ.11 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ తర్వాత తన పారితోషికాన్ని భారీగా పెంచేసిందని తెలుస్తోంది. అలాగే భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు నయనతార కాల్షీట్స్ కోసం ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. జవాన్ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించారు. షారుక్, నయన్‌తో పాటు దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి, ప్రియమణి, సంజయ్ దత్, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవర్, సంజీత్ భట్టాచార్య తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. జవాన్ సినిమా తర్వాత ఇరైవన్ అనే సినిమాలో నటిస్తోంది నయన్. జయం రవి ఇందులో హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు ‘లేడీ సూపర్ స్టార్ 75 (వర్కింగ్ టైటిల్)’, టెస్ట్ అనే సినిమాల్లో నటిస్తోందీ అందాల తార.
నయనతార పోస్ట్
నయనతార లేటెస్ట్ ఫొటోస్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..