AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal : ఆ దర్శకుడితో ఎప్పటికీ సినిమా చేయను.. విశాల్ షాకింగ్ కామెంట్స్

హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు విశాల్. ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోని అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విశాల్ డ్యూయల్ రోల్ లో నటించనున్నాడు. అలాగే ఈ మూవీలో దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే విశాల్ ఓ దర్శకుడి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Vishal : ఆ దర్శకుడితో ఎప్పటికీ సినిమా చేయను.. విశాల్ షాకింగ్ కామెంట్స్
Vishal
Rajeev Rayala
|

Updated on: Sep 14, 2023 | 11:09 AM

Share

తమిళ్ స్టార్ హీరో విశాల్ సినిమాలకు మన దగ్గర కూడా మంచి క్రేజ్ ఉంది. విశాల్ నటిస్తున్న సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు విశాల్. ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోని అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విశాల్ డ్యూయల్ రోల్ లో నటించనున్నాడు. అలాగే ఈ మూవీలో దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే విశాల్ ఓ దర్శకుడి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ కోలీవుడ్ దర్శకుడితో సినిమాలు చేసేది లేదు అని తెగేసి చెప్పేశారు. విశాల్ దర్శకుడు మిస్కిన్‌ పై మండిపడ్డారు. అతడి ప్రవర్తన తనకు నచ్చలేదు అని తెలిపాడు విశాల్. విశాల్, మిస్కిన్ కలిసి తుప్పరివాలన్‌ అనే సినిమా చేశారు. ఈ సినిమా తెలుగులో డిటెక్టివ్‌ అనే పేరుతో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ సమయంలో దర్శకుడి ప్రవర్తన వల్ల చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. మిస్కిన్ పెట్టిన ఇబ్బందికి మరొకరైతే చచ్చిపోతారని అన్నారు విశాల్.

యాక్షన్ హీరో విశాల్ మాట్లాడుతూ.. మిస్కిన్ తో కలిసి నటించడం ఎప్పటికీ జరగదు. అతను పెట్టిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.. తుప్పరివాలన్‌ 2 సమయంలో ఆయన నన్ను చాల ఇబ్బంది పెట్టారు. నా స్థానంలో మరో పెద్ద వాయసున్న నిర్మాత ఉండుంటే హార్ట్ ఎటాక్ వచ్చేది అని అన్నారు విశాల్. అతడు చేసిన దానికి నేను లండన్ ప్లాట్‌ఫామ్స్‌పై ఒంటరిగా కూర్చొని బాధపడ్డా.. అని తెలిపారు. తుప్పరివాలన్‌ 2 సినిమాను నేను త్వరలోనే మొదలు పెడతా.. నా సొంత స్క్రీన్‌ప్లేతోనే ఈ సినిమా ఉంటుంది అని తెలిపారు విశాల్.

విశాల్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

విశాల్ మార్క్ ఆంటోని మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.