Shraddha Arya: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. శుభవార్తను ఎంత క్యూట్‌గా చెప్పిందో చూశారా? వీడియో

ప్రముఖ టాలీవుడ్ నటి శ్రద్ధా ఆర్య శుభవార్త చెప్పింది. త్వరలో తాను అమ్మగా ప్రమోషన్ పొందనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు ఒక బ్యూటిఫుల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ అందాల తార. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Shraddha Arya: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. శుభవార్తను ఎంత క్యూట్‌గా చెప్పిందో చూశారా? వీడియో
Shraddha Arya
Follow us
Basha Shek

|

Updated on: Sep 18, 2024 | 10:27 AM

ప్రముఖ టాలీవుడ్ నటి శ్రద్ధా ఆర్య శుభవార్త చెప్పింది. త్వరలో తాను అమ్మగా ప్రమోషన్ పొందనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు ఒక బ్యూటిఫుల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ అందాల తార. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్రద్ధా ఆర్యకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. న్యూఢిల్లీకి చెందిన శ్రద్ధ 2021 నవంబర్‌లో రాహుల్ నాగల్‌ అనే నేవీ ఆఫీసర్‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడీ మూడేళ్ల ప్రేమ బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారీ లవ్లీ కపుల్. శ్రద్ధా ఆర్య 2006లో కల్వనిన్ కదాలి అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో నిశ్శబ్ద్‌ తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక 2007లో గొడవ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. కోదండ రామిరెడ్డి తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో వైభవ్ హీరోగా నటించాడు. ఈ మూవీలో శ్రద్దా ఆర్య అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. దీని తర్వాత రోమియో, కోతిమూక లాంటి టాలీవుడ్ సినిమాల్లో కనిపించింది శ్రద్ధ.

తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ నటించింది శ్రద్ధా ఆర్య. అయితే ఎందుకో గానీ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఆమె బాలీవుడ్‌లో చివరిసారిగా రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్ కహానీ మూవీలో మెరిసింది. అయితే వెండితెర పెద్దగా అచ్చి రాకపోయినా.. బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

త్వరలోనే ఓ లిటిల్ మిరాకిల్.. శ్రద్ద షేర్ చేసిన వీడియో ఇదిగో..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Shraddha Arya (@sarya12) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

‘తుమ్‌హారి పాఖి’, ‘కుండలి భాగ్య’, ‘డ్రీమ్ గర్ల్’ లాంటి సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందిందీ ముద్దుగుమ్మ. ఇక 2021 నవంబర్‌లో రాహుల్ అనే నేవీ ఆఫీసర్‌ను వివాహం చేసుకున్న శ్రద్ధ పెళ్లి తర్వాత కూడా సీరియల్స్ తో బిజీ బిజీగా ఉంటోంది.

భర్తతో శ్రద్ధా ఆర్య..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Shraddha Arya (@sarya12) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.