GOAT Box office Day 1: బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తున్న ది గోట్.. తొలిరోజు విజయ్ సినిమా ఎంత వసూల్ చేసిందంటే..

వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌తోపాటు ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, వైభవ్, ప్రేమ్జీ తదితరులు నటించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అర్చన కల్పాతి ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

GOAT Box office Day 1: బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తున్న ది గోట్.. తొలిరోజు విజయ్ సినిమా ఎంత వసూల్ చేసిందంటే..
Goat Movie
Follow us

|

Updated on: Sep 06, 2024 | 3:49 PM

దళపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమా రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. గురువారం( సెప్టెంబర్ 5న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌తోపాటు ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, వైభవ్, ప్రేమ్జీ తదితరులు నటించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అర్చన కల్పాతి ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. దాదాపు 400 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ సినిమా మొదటి షో నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన గోట్ మూవీ మొదటి రోజు భారీగానే కలెక్ట్ చేసింది. ఈ న్యూస్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది.

వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన  ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. విజయ్ ఈ సినిమాకంటే ముందు నటించిన బీస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా విజయం సాధించలేదు. గోట్ సినిమా ఏజీఎస్ సంస్థకు 25వ చిత్రం. సినీ రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వస్తానని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. దీని తరువాత, గురువారం ప్రపంచవ్యాప్తంగా గోట్ విడుదలైంది. గోట్ సినిమా చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

విజయ్ ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా రెండు పాత్రలు పోషించారు. కొడుకు పాత్రలో నటించిన విజయ్ వయసును తగ్గించేందుకు డీ ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. అలాగే త్రిష, శివకార్తికేయన్‌లు అతిధి పాత్రల్లో నటించారు.  తమిళనాడులోనే సోలో దాదాపు 1,100 థియేటర్లలో విడుదలైంది. ఇది కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్లలో సినిమా విడుదలైంది. తమిళం, హిందీ, తెలుగు, కన్నడ , మలయాళం భాషల్లో విడుదలైంది. ‘ది గోట్’ తొలి రోజు ఎంత కలెక్ట్ చేసిందనే సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా రూ. 43 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అందులో తమిళనాడులో రూ.38.3 కోట్లు, తెలుగులో రూ. 3 కోట్లు, హిందీలో రూ.1.7 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసి ఉండవచ్చని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.