AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay-Rashmika: మేమేం పాపం చేశామన్నా? విజయ్-రష్మికల వెడ్డింగ్‌పై గబ్బర్ సింగ్ బ్యాచ్ వీడియో వైరల్

టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా కొన్ని రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక జరిగి సుమారు నెల రోజులైనా వీరి వివాహ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికీ తెగ వైరల్ అవుతున్నాయి.

Vijay-Rashmika: మేమేం పాపం చేశామన్నా? విజయ్-రష్మికల వెడ్డింగ్‌పై గబ్బర్ సింగ్ బ్యాచ్ వీడియో వైరల్
Vijay Devarakonda, Rashmika
Basha Shek
|

Updated on: Mar 23, 2026 | 7:08 PM

Share

స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల పెళ్లి వేడుక గత నెలలో గ్రాండ్ గా జరిగింది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్ వేదికగా వీరిద్దరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ వేదికగా కూడా విరోష్ ల వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్ పార్టీకి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల కొందరు అభిమానులు.. ‘మేం కూడా మీకు అభిమానులే.. మమ్మల్ని ఎందుకు పెళ్లికి పిలవలేదు’ అంటూ వీడియోలు చేస్తున్నారు. అలా ఇటీవల ఒక వీడియో చేసిన చిన్నారిని స్వయంగా విజయ్ దేవరకొండ తన ఇంటికి ఆహ్వానించి ఆ చిన్నారికి లడ్డూలు, పులిహోరలతో విందు భోజనాలు పెట్టారు. తద్వారా ఆ చిన్నారి కళ్లల్లో ఆనందాన్ని నింపారు. తాజాగా గబ్బర్ సింగ్ సినిమా కమెడియన్స్ సైతం విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి గురించి ఒక వీడియో చేశారు.

‘విజయ్ దేవరకొండ అన్నా.. రష్మిక వదిన హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మీకు పెళ్లయింది అన్న అందర్నీ పిలిచిండ్రు.. మమ్మల్ని పిలవచ్చు కదా అన్న.. మేము కూడా మీకు ఫ్యాన్సు.. మేము కూడా ఆర్టిస్టులమే మమ్మల్ని పిలవచ్చు కదా అన్నా. అందర్నీ పెళ్లికి పిలిచిండ్రు లడ్డూలు పెట్టారు, పులిహోర పెట్టారు.. మేమేం పాపం చేసినామన్నా.. మమ్మల్ని కూడా పెళ్లికి పిలవచ్చు కదా’ అంటూ సరదాగా అడిగారు గబ్బర్ సింగ్ బ్యాచ్ . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వీడియో పై విజయ్ దేవరకొండ- రష్మిక స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ఇదిగో..

ఇక పెళ్లి కోసం సినిమా షూటింగ్ లకు కొంత గ్యాప్ ఇచ్చారు విజయ్ -రష్మిక. అయితే ఇప్పుడు తిరిగి తమ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ కానున్నారీ న్యూ కపుల్. ప్రస్తుత రష్మిక విజయ్ దేవరకొండ జంటగా రణబాలి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us