Shubman Gill : ఐపీఎల్ ఫైనల్స్‌లో ప్రిన్స్ రికార్డులు ఇవే.. గుజరాత్ కెప్టెన్ రేంజ్ చూస్తే ఆర్సీబీకి వణుకు తప్పదా?
Shubman Gill : గుజరాత్ టైటాన్స్ యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఐపీఎల్ ఫైనల్స్ ఆడటం ఇదేం కొత్త కాదు. అతని కెరీర్‌లో ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంది. ఈ 2026 ఫైనల్ మ్యాచ్ అతనికి నాలుగో ప్రదర్శన కావడం విశేషం.

Shubman Gill : క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ 2026 (IPL 2026) ముగింపు ఘట్టానికి చేరుకుంది. మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు ఐపీఎల్ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి కావడంతో మ్యాచ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్‌ను క్వాలిఫైయర్-2 లో ఓడించి ఫైనల్‌కు దూసుకొచ్చిన గుజరాత్ జట్టు, తమ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది.
నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్ బరిలో గిల్
గుజరాత్ టైటాన్స్ యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఐపీఎల్ ఫైనల్స్ ఆడటం ఇదేం కొత్త కాదు. అతని కెరీర్‌లో ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంది. ఈ 2026 ఫైనల్ మ్యాచ్ అతనికి నాలుగో ప్రదర్శన కావడం విశేషం. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఒకసారి, గుజరాత్ టైటాన్స్ తరఫున రెండు సార్లు అతను ఫైనల్ మ్యాచ్‌లలో భాగమయ్యాడు. పెద్ద మ్యాచ్‌లలో ఒత్తిడిని తట్టుకుని నిలబడటంలో గిల్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది.
కేకేఆర్ తరఫున తొలి ఫైనల్
శుభ్‌మన్ గిల్ తన కెరీర్‌లో మొట్టమొదటి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. అప్పట్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గిల్.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి 43 బంతుల్లో 51 పరుగులతో అద్భుత హాఫ్ సెంచరీ సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 118.60 గా నమోదైంది. గిల్ రాణించినప్పటికీ, ఆ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టును సీఎస్‌కే 27 పరుగుల తేడాతో ఓడించడంతో గిల్‌కు రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
గుజరాత్ టైటాన్స్‌తో తొలి సీజన్లోనే ట్రోఫీ కైవసం
కేకేఆర్ వీడిన తర్వాత శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరి ఆ టీమ్‌కు అత్యంత కీలక ప్లేయర్‌గా మారాడు. 2022లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరి రాజస్థాన్ రాయల్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో గిల్ చాలా సంయమనంతో బ్యాటింగ్ చేసి 43 బంతుల్లో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, గుజరాత్ జట్టు సులువుగా లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలవడంలో కీలక పాత్ర పోషించింది.
సీఎస్‌కేతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్
ఆ తర్వాతి ఏడాది అంటే 2023 ఐపీఎల్ సీజన్లోనూ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో గిల్ ఊరమాస్ బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే 195.00 లీథల్ స్ట్రైక్ రేట్‌తో 39 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో వర్షం కారణంగా డీఎల్ఎస్ పద్ధతిలో సీఎస్‌కే జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ కొట్టేసింది.
ఐపీఎల్ ఫైనల్స్‌లో ఓవరాల్ స్టాట్స్
ఇప్పటివరకు ఆడిన మూడు ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్‌లలో శుభ్‌మన్ గిల్ ఓవరాల్ ప్రదర్శన చాలా నిలకడగా ఉంది. అతను 3 ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 106 బంతులను ఎదుర్కొని 135 పరుగులు సాధించాడు. ఫైనల్స్ వంటి పెద్ద మ్యాచ్‌లలో గిల్ ఏకంగా 67.50 అద్భుతమైన బ్యాటింగ్ యావరేజ్ కలిగి ఉండటం విశేషం. అతని ఓవరాల్ స్ట్రైక్ రేట్ 127.35 గా ఉంది. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే గిల్ పెద్ద మ్యాచ్‌లలో ఎంత ప్రశాంతంగా, నిలకడగా ఆడతాడో అర్థం చేసుకోవచ్చు.
ఐపీఎల్ కెరీర్‌లో 2018 నుంచి నేటివరకు రికార్డులు
2018లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన శుభ్‌మన్ గిల్, చాలా తక్కువ సమయంలోనే లీగ్‌లోనే టాప్ బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 133 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 142.13 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 4,588 పరుగులు స్కోర్ చేశాడు. ఇందులో 5 అద్భుత సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ అపారమైన అనుభవంతోనే గిల్ మరోసారి ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు.
ఈ ఐపీఎల్ 2026 సీజన్లో గిల్ విశ్వరూపం
ఐపీఎల్ 2026 సీజన్లో శుభ్‌మన్ గిల్ అరాచకమైన ఫామ్‌లో ఉన్నాడు. సాయి సుదర్శన్‌తో కలిసి ఈ సీజన్లోనే అత్యంత సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ జోడీగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం గిల్ 15 ఇన్నింగ్స్‌లలో 163.71 లీథల్ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 722 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 157.14 స్ట్రైక్ రేట్‌తో 77 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి ఆర్సీబీ స్టార్ బేసర్లను ఎదుర్కొని గుజరాత్‌కు పవర్‌ప్లేలో మంచి ఆరంభాన్ని ఇవ్వడమే లక్ష్యంగా గిల్ బరిలోకి దిగుతున్నాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
