AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram Srinivas: త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాలు చేయరా

Trivikram Srinivas: త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాలు చేయరా

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 23, 2026 | 6:36 PM

Share

ఆదర్శ కుటుంబం తర్వాత త్రివిక్రమ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు స్వస్తి చెప్పి, పౌరాణిక చిత్రాల వైపు అడుగులేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, 'గాడ్ ఆఫ్ వార్' (కార్తికేయ స్వామి నేపథ్యంలో) మరియు రామాయణం వంటి భారీ ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్నారు. ఈ మార్పు గురూజీని కొత్త శిఖరాలకు చేర్చుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఆదర్శ కుటుంబం తర్వాత త్రివిక్రమ్ నుంచి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు రావడం కష్టమేనా..? రూట్ మార్చి పాన్ ఇండియా వైపు.. మరీ ముఖ్యంగా పౌరాణికాల వైపు అడుగులేస్తున్నారా..? అసలు గురూజీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి.. ఆయన మైండ్‌లో ఉన్న ఆ భారీ ప్రాజెక్ట్స్ ఏంటి.. గాడ్ ఆఫ్ వార్ కాకుండా మరో కథ కూడా సిద్ధం చేస్తున్నారా..? తన తోటి దర్శకులంతా ప్యాన్ ఇండియా వైపు వెళ్లినా.. త్రివిక్రమ్ మాత్రం ఇన్నాళ్లూ కేవలం తెలుగుకే పరిమితమయ్యారు. ఇప్పుడు కూడా వెంకీతో ఆదర్శ కుటుంబం తెరకెక్కిస్తున్నారు. కానీ దీని తర్వాత కమర్షియల్ ఫ్యామిలీ డ్రామాలకు ఫుల్ స్టాప్ పెట్టి.. మైథలాజికల్ ప్రాజెక్ట్స్‌ వైపు అడుగులేయబోతున్నారు త్రివిక్రమ్. తన సినిమాల్లో మ్యాగ్జిమమ్ పౌరాణికాల రిఫరెన్సులు వాడుకోవడం గురూజీకి అలవాటే. రామాయణ కథను త్రివిక్రమ్ తనదైన స్టైల్‌లో రాసుకున్నారని రీసెంట్‌గా తమన్ తెలిపారు. ఇప్పటి వరకు రామాయణంపై ఎన్నో సినిమాలు వచ్చినా సరే.. మామూలుగానే పురాణాలపై త్రివిక్రమ్‌కు పట్టు ఎక్కువ కాబట్టి వాటికి పూర్తి భిన్నంగా ఎవరూ టచ్ చేయని డీప్ పాయింట్స్‌తో ఈ కథను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించాలని గురూజీ చూస్తున్నారు. రామాయణంతో పాటుగా త్రివిక్రమ్ లైనప్‌లో కార్తికేయ స్వామి నేపథ్యంగా సాగే గాడ్ ఆఫ్ వార్ కూడా ఉంది. మైండ్ బ్లాక్ అయ్యే ఈ మైథలాజికల్ యాక్షన్ స్క్రిప్ట్ కోసం ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ల మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరు ఇందులో నటించబోతున్నారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు హీరోలతోనూ గురూజీకి మంచి రిలేషన్ ఉంది. గాడ్ ఆఫ్ వార్, రామాయణం కాకుండా త్రివిక్రమ్ దగ్గర ఇలాంటి భారీ స్క్రిప్ట్స్ ఇంకా చాలానే సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే ఇకపై రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు చేయకూడదని.. భారీ పౌరాణికాలతోనే ప్యాన్ ఇండియాను టార్గెట్ చేసి.. బాక్సాఫీస్ బద్దలు కొట్టాలని గురూజీ గట్టిగా ఫిక్స్ అయినట్లు అర్థమవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??

Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం

BIKER Trailer : బైకర్‌ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్‌

స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు.. ఒకేసారి రెండు మూడు కథలు లైన్‌లో పెడుతున్నారు

Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. ఈసారి దబిడి దిబిడే..

Published on: Mar 23, 2026 06:35 PM
Follow Us