AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరినీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

చాలా మందికి ఉదయం నిద్రలేవగానే వేడి వేడిగా ఒక కప్పు టీ లేదా కాఫీ తాగడం అలవాటు. అది లేకపోతే రోజూ గడవదనే వారు కూడా ఉన్నారు. అయితే ఈ అలవాటుకు బదులుగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో అమృతం లాంటి కొబ్బరి నీళ్లను తాగితే శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా? విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండే కొబ్బరి నీటితో రోజును ప్రారంభిస్తే కలిగే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: May 31, 2026 | 7:10 AM

Share
క్షణాల్లో అలసట మాయం: రాత్రి 7 నుండి 8 గంటల నిద్ర తర్వాత మన శరీరం సహజంగానే నిర్జలీకరణానికి గురవుతుంది. అందుకే ఉదయం లేవగానే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అందులోని పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. బాడీని త్వరగా రీహైడ్రేట్ చేసి, ఉదయం పూట వచ్చే అలసట, తలతిరగడం వంటి సమస్యలను దూరం చేస్తాయి.

1 / 5
గ్యాస్, ఎసిడిటీకి శాశ్వత పరిష్కారం: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ శరీర మెటబాలిజాన్ని పెంచి, అజీర్ణం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరి నీరు సహజంగా క్షార గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఉదయాన్నే వేధించే గుండెమంట, ఎసిడిటీ సమస్యలను ఇది త్వరగా అదుపులోకి తెస్తుంది.

2 / 5
బరువు తగ్గడడం: బరువు తగ్గడానికి డైట్ ప్లాన్ చేస్తున్న వారికి కొబ్బరి నీరు ఒక అద్భుతమైన హెల్తీ డ్రింక్. ఇందులో కేలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల ఎక్కువ ఆహారం తీసుకోకుండా  మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.

3 / 5
సహజమైన మెరుపు: కొబ్బరి నీరు చర్మాన్ని లోపలి నుండి పోషిస్తుంది. ఇందులో ఉండే సైటోకైనిన్లు చర్మ కణాలు త్వరగా వృద్ధాప్య ఛాయల బారిన పడకుండా కాపాడతాయి. ప్రతిరోజూ పరగడుపున కొబ్బరి నీరు తాగడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది. చర్మానికి సహజమైన గ్లో రావడంతో పాటు యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

4 / 5
బాడీ డిటాక్సిఫికేషన్: కొబ్బరి నీరు శరీరంలో ఒక మంచి క్లెన్సర్‌లా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన హానికరమైన టాక్సిన్స్ మూత్రం ద్వారా బయటకు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా కొబ్బరి నీరు ఎంతో మేలు చేస్తుంది. కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలతో రోజును ప్రారంభించి లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కంటే.. ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి నీళ్లతో ఆరోగ్యకరమైన జీవనశైలికి శ్రీకారం చుట్టడం ఎంతో ఉత్తమం.

5 / 5
Follow Us