Tollywood: శ్రియా మొదటి సినిమా ‘ఇష్టం’ హీరో ఎలా చనిపోయాడో తెలుసా? ఇతని భార్య టాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్
శ్రియా శరణ్ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా ఇష్టం. 2001లో రిలీజైన ఈ సినిమాలో శ్రియా సరసన చరణ్ రెడ్డి అనే హీరో నటించాడు. అతనికి కూడా ఇదే మొదటి సినిమా. అయితే ఈ సినిమా రిలీజైన కొన్నేళ్లకు అతను అకస్మాత్తుగా చనిపోయాడు.

సినిమా ఇండస్ట్రీలో కొందరి నటీనటుల మరణం ఇప్పటికీ మిస్టరీ గానే మిగిలిపోయింది. అందులో ఇష్టం సినిమా హీరో చరణ్ రెడ్డి చావు కూడా ఒకటి. ఇష్టం సినిమాను ఇప్పటికీ గుర్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం శ్రియానే. ఎందుకంటే ఇది ఆమె కు మొదటి సినిమా. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఈ సినిమాను నిర్మించారు. మనం, 24 సినిమాలతో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కే కుమార్ ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో చరణ్ రెడ్డి హీరోగా నటించాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రియతో పాటు చరణ్ కు కూడా ఇది మొదటి సినిమానే. 2001లో రిలీజైన ఇష్టం సినిమా ఓ మోస్తరుగా ఆడింది. హీరోయిన్ శ్రియ, హీరో చరణ్ రెడ్డిలకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత శ్రియ స్టార్ హీరోయిన గా ఎదిగిపోయింది. కానీ చరణ్ రెడ్డి మాత్రం మరే మూవీలోనూ కనిపించలేదు. అయితే ఇష్టం సినిమా తర్వాత సుమారు 11 ఏళ్లకు అంటే 2012 మార్చి 19న చరణ్ రెడ్డి చనిపోయాడన్న వార్త టాలీవుడ్ తో పాటు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కాగా ఇష్టం సినిమా తర్వాత చరణ్ రెడ్డి అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ(‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ హీరోయిన్) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. విడాకుల కోసం ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. ఇక చరణ్ చనిపోయేనాటికి అతని వయసు కేవలం 36 ఏళ్లు మాత్రమే. తీవ్రమైన గుండె నొప్పి రావడంతో మొదట అతనిని పోలో హాస్పిటల్ లో జాయిన్ చేసారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో చరణ్ కన్నుమూశాడు. అయితే ఆ తర్వాత ఆయనకు ఫోరెన్సిక్ బృందం నిర్వహించిన పరీక్షలో చరణ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను పూర్తిగా తాగుడుకు బానిస అయ్యాడని, ఈ కారణంగానే అతని లివర్ పాడైందని వైద్య పరీక్షల్లో తేలింది. చరణ్ మరణానికి ఇదే ప్రధాన కారణమని డాక్టర్లు తేల్చేశారు.
కాగా చరణ్ అక్కినేని కుటుంబానికి అల్లుడని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అయితే తనకు సినీ అవకాశాలు లేకపోయినా, ఇతర ఇబ్బందుల్లో ఉన్నా ఎప్పుడూ ఆ ఫ్యామిలీ పేరును చరణ్ వాడుకోలేదని, ఇది అతని మంచితనానికి నిదర్శనమని తెలిసినవారు చెబుతుంటారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




