AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar: పునీత్‌ ఫ్యామిలీకి ఏమైంది? వెంటాడుతోన్న వరుస విషాదాలు.. మనో వేదనలో కుటుంబీకులు

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన హఠాన్మరణంతో శాండల్‌ వుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. అభిమానులు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు.కాగా విజయ్ రాఘవేంద్ర పునీత్‌ రాజ్ కుమార్ కుటుంబానికి దగ్గరి బంధువు . పునీత్‌ మాతృమూర్తి పార్వతమ్మ రాజ్‌కుమార్ సోదరుడి పిల్లలే విజయ్ రాఘవేంద్ర, శ్రీమురళి

Puneeth Rajkumar: పునీత్‌ ఫ్యామిలీకి ఏమైంది? వెంటాడుతోన్న వరుస విషాదాలు.. మనో వేదనలో కుటుంబీకులు
Puneeth Rajkumar Family
Basha Shek
|

Updated on: Aug 08, 2023 | 5:55 AM

Share

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన హఠాన్మరణంతో శాండల్‌ వుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. అభిమానులు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు.కాగా విజయ్ రాఘవేంద్ర పునీత్‌ రాజ్ కుమార్ కుటుంబానికి దగ్గరి బంధువు . పునీత్‌ మాతృమూర్తి పార్వతమ్మ రాజ్‌కుమార్ సోదరుడి పిల్లలే విజయ్ రాఘవేంద్ర, శ్రీమురళి.  గత కొన్నేళ్లుగా రాజ్‌కుమార్‌ ఫ్యామిలీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. పునీత్ రాజ్‌కుమార్ మరణం నుంచి నేటి స్పందన మరణం వరకు వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో అతని కుటుంబీకులు మనో వేదనకు గురవుతున్నారు. అభిమానులందరూ అప్పు అని పిలుచుకునే పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం రాజ్‌కుమార్‌ ఫ్యామిలీని బాగా కుంగదీసింది. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో చనిపోయాడంటే ఇప్పటికీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణం పునీత్‌ ఫ్యామిలీతో పాటు అభిమానులను బాగా కుంగదీసింది.

భర్త వెంటనే తండ్రి మరణం..

పునీత్ రాజ్‌కుమార్ మరణం తర్వాత అశ్విని తీవ్ర మనోవేదనకు లోనైంది. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఆమెకు మరో షాక్ తగిలింది. అశ్విని తండ్రి రేవనాథ్ 2000 ఫిబ్రవరి 20న కన్నుమూశారు. భర్తను పోగొట్టుకున్న బాధతో ఉండగానే అశ్విని తండ్రిని కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

కాలు కోల్పోయిన సూరజ్

ఇక పార్వతమ్మ రాజ్‌కుమార్‌ కుమారుడు సూరజ్‌ కొన్ని వారాల క్రితం ఘోర ప్రమాదంలో కాలు కోల్పోయాడు. జూన్ 24న బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో అతని కుడి కాలు పూర్తిగా నుజ్జునుజ్జయింది. దీంతో వైద్యులు అతడి కాలు తీసేయాల్సి వచ్చింది. హీరోగా ఎదగాలని సూరజ్‌ కలలను ఈ యాక్సిడెంట్‌ కల్లలు చేసింది.

గుండెపోటుతో స్పందన..

ఇక విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన తన కుటుంబంతో కలిసి బ్యాంకాక్ వెళ్లింది. అక్కడే ఆమెకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. స్పందన మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక భార్యతో కలిసి జీవితాంతం కష్ట సుఖాలు పంచుకోవాలన్న విజయ్ రాఘవేంద్ర కన్నీరుమున్నీరవుతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..