Gaddar-Pawan Kalyan: ‘నా అన్న ప్రజా యుద్ధనౌక గద్దర్’.. పవన్ కళ్యాణ్ ప్రత్యేక కావ్యం..
పది రోజుల క్రితం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన గద్దర్.. అప్పటినుంచి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే ఆగస్ట్ 6న తుదిశ్వాస విడిచారు. గద్దర్ మరణవార్త విని యావత్ తెలంగాణ ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యా్ప్తంగా ఉన్న కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు, అభిమానులు గద్దర్ ను చివరి చూపు చూసేందుకు భారీగా తరలివచ్చారు. విప్లవవీరుడి భౌతిక కాయం చూసి అభిమానులు, నాయకులు కంటతడి పెట్టుకున్నారు.
ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. అల్వాల్‌లోని మహాబోధి విద్యాలయంలో ప్రభుత్వ లాంఛానాలతో విప్లవ వీరుడికి తుది వీడ్కోలు పలికారు. పోలీసులు గౌరవ వందనం చేసి.. గాలిలోకి మూడు రౌండ్స్ కాల్పులు జరిపారు. భౌద్ద సంప్రదాయం ప్రకారం గద్దర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పది రోజుల క్రితం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన గద్దర్.. అప్పటినుంచి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే ఆగస్ట్ 6న తుదిశ్వాస విడిచారు. గద్దర్ మరణవార్త విని యావత్ తెలంగాణ ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యా్ప్తంగా ఉన్న కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు, అభిమానులు గద్దర్ ను చివరి చూపు చూసేందుకు భారీగా తరలివచ్చారు. విప్లవవీరుడి భౌతిక కాయం చూసి అభిమానులు, నాయకులు కంటతడి పెట్టుకున్నారు.
ఇక గద్దర్‌కు ఎంతో అప్తుడైన పవన్ కళ్యాణ్ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గద్దర్ ను ఒక ప్రజా గాయకుడికా ఎంతో గౌరవిస్తూ.. తన సొంత అన్నలా భావించేవారు. గద్దర్, పవన్ మధ్య మంచి అనుబంధం ఉండేది. గద్దర్ మరణవార్త విన్న వెంటనే ఆయన భౌతిక కాయం వద్దకు చేరుకుని కంటతడి పెట్టుకున్నారు. కాసేపటి క్రితం గద్దర్ పై ప్రత్యేక కావ్యం చెబుతూ ఓ వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు పవన్. ‘నా అన్న ప్రజా యుద్ధనౌక గద్దర్’.. అంటూ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు పవన్.
“బీటలు వారిన ఎండలో సమ్మిట కొట్టే కూలీకి గొడుగు గద్దర్.. తాండాల బండల్లో చలిపులిని బెదిరించే నెగడు గద్దర్.. పీడిత జనుల పాట గద్దర్.. అణగారిన ఆర్తుల ఆసరా గద్దర్.. అడవిలో ఆకు చెప్పిన కథ గద్దర్.. కోయిల పాడిన కావ్యం గద్దర్.. గుండెకు గొంతోస్తే..బాధకు భాషోస్తే.. అది గద్దర్.. అన్నింటిని మించి నా అన్న గద్దర్.. అన్నా.. నువ్వు గాయపడ్డ పాటవి.. కానీ ప్రజల గాయాలకు పట్టుబడ్డ పాటవి. అన్యాయంపై తిరగబడ్డ పాటవి. ఇదివరకు నువ్వు ధ్వనించే పాటవి. ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి. తీరం చేరిన ప్రజా యుద్దనౌకకు జోహార్.”
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.