AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగర్ మంగ్లీ సొంత చెల్లి ఇంద్రావతి గురించి మీకు ఈ విషయాలు తెలుసా…?

జానపద సంగీతం నుంచి వచ్చిన స్వచ్ఛమైన గాత్రమే ఇంద్రావతి చౌహాన్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. బంజారా సంప్రదాయాల్లో పెరిగిన ఆమె, క్లాసికల్ ట్రైనింగ్ కంటే సహజమైన ఫోక్ స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ‘ఊ అంటావా మావా’ పాటతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఆమె ప్రయాణం గ్రామీణ వేదికల నుంచి పాన్ ఇండియా స్థాయికి చేరిన అరుదైన కథగా నిలిచింది.

సింగర్ మంగ్లీ సొంత చెల్లి ఇంద్రావతి గురించి మీకు ఈ విషయాలు తెలుసా...?
Mangli - Indravathi Chauhan
Ram Naramaneni
|

Updated on: May 04, 2026 | 12:33 PM

Share

ఇంద్రావతి చౌహాన్‌ ఒక భారతీయ నేపథ్య గాయని. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో మాస్‌, ఫోక్‌ స్టైల్ పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె 2021లో విడుదలైన పుష్ప: ది రైజ్ చిత్రంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఐటమ్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా, చంద్రబోస్‌ సాహిత్యం రాశారు. సమంత చేసిన ఐటమ్ సాంగ్ కావడం, అల్లు అర్జున్‌ సినిమాలో భాగం కావడం వల్ల ఈ పాటకు భారీ క్రేజ్ వచ్చింది.

ఇంద్రావతి చౌహాన్‌ 1996 మార్చి 5న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా, గుత్తి మండలం బసినేపల్లె తాండలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు బల్లు నాయక్‌, లక్ష్మీదేవి. వీరికి మంగ్లీ, ఇంద్రావతి, వెంకటలక్ష్మి, శివ చౌహాన్‌ అనే నలుగురు సంతానం. ప్రముఖ సింగర్ మంగ్లీకి ఇంద్రావతి ఓన్ సిస్టర్ అనమాట. ఆమె బంజారా (లంబాడీ) కమ్యూనిటీకి చెందినది. ఆమె మాతృభాష గోర్ బోలి (లంబాడీ), దీనికి లిపి లేకపోవడం ప్రత్యేకత. పాఠశాల విద్యను భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్‌లో పూర్తి చేసి, అనంతరం శ్రీ వెంకటేశ్వర కళాశాలలో డిప్లొమా చదివింది.

ఇంద్రావతి చిన్నప్పటి నుంచే జానపద సంగీతంపై ఆసక్తి పెంచుకుంది. ఆమె ఒక ఫోక్ సింగర్ మాత్రమే కాకుండా మంచి నర్తకి కూడా. ‘బోల్ బేబీ బోల్’ రియాలిటీ షోలో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకుంది. అలాగే జార్జిరెడ్డి సినిమాలో ‘జాజిమొగులాలి’ పాట పాడి గుర్తింపు పొందింది. 2022లో ప్రముఖ డిజిటల్ మీడియా గ్రూప్ నిర్వహించిన ఈవెంట్‌లో ‘పుష్ప’ సినిమాలోని పాటకు గాను బెస్ట్ సింగర్ అవార్డు అందుకుంది.

సోషల్ మీడియాలో కూడా ఇంద్రావతి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంద్రావతి చౌహాన్‌కు ప్రత్యేకంగా క్లాసికల్ ట్రైనింగ్ కంటే, జానపద సంప్రదాయాల మధ్య పెరిగి సహజంగా వచ్చిన గాత్రమే ఆమె ప్రత్యేకత. అదే ఆమె వాయిస్‌కు మాస్ అప్పీల్ తీసుకొచ్చింది. తక్కువ పాటలే పాడినా, ప్రతి పాటతో ప్రత్యేక ముద్ర వేసిన గాయని ఇంద్రావతి.

అసలు ఎవరీ మంగ్లీ.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..? 

Follow Us
పెట్రోల్బైకు వీడ్కోలు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 212 కి.మీ. మైలేజీ!
పెట్రోల్బైకు వీడ్కోలు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 212 కి.మీ. మైలేజీ!
యాంకరమ్మ బ్యాడ్ లక్.. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్సయ్యింది.
యాంకరమ్మ బ్యాడ్ లక్.. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్సయ్యింది.
మీ పెంపుడు జంతువు మాట్లాడితే?సరికొత్త పెట్ ట్రాన్స్‌లేటర్ మీ కోసం
మీ పెంపుడు జంతువు మాట్లాడితే?సరికొత్త పెట్ ట్రాన్స్‌లేటర్ మీ కోసం
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అక్కడ కూడా దర్శనం టికెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అక్కడ కూడా దర్శనం టికెట్లు
నిజమా.. గర్భిణీ స్త్రీలను పాము కరవదా..? అసలు వాస్తవాలు..
నిజమా.. గర్భిణీ స్త్రీలను పాము కరవదా..? అసలు వాస్తవాలు..
మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే!
మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే!
వంటగదిలో బొద్దింకలా? వాస్తు ప్రకారం ఇది ఆర్థిక సమస్యలకు సంకేతమట!
వంటగదిలో బొద్దింకలా? వాస్తు ప్రకారం ఇది ఆర్థిక సమస్యలకు సంకేతమట!
ఆ జట్టుతో ప్లేఆఫ్స్ ఆడడం కంటే బౌలర్లకు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్
ఆ జట్టుతో ప్లేఆఫ్స్ ఆడడం కంటే బౌలర్లకు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్
మీకు రూ.50 లక్షల ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ పొందడానికి ఎంత జీతం ఉండాలి?
మీకు రూ.50 లక్షల ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ పొందడానికి ఎంత జీతం ఉండాలి?
రౌడీ జనార్ధనలో ఆ క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్..
రౌడీ జనార్ధనలో ఆ క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్..