AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాగా తెరకెక్కనున్న వాజ్‌పేయి జీవితం!

బీజేపీ అగ్ర నేత, భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి జీవిత చరిత్ర వెండి తెరపైకి రాబోతోంది. ఆయన 2018, ఆగస్టు 16న కన్నుమూసి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఆయన జీవితంపై సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వాజ్‌పేయి జీవిత చరిత్రకు సంబంధించి ఉల్లేక్‌ అనే రచయిత రాసిన ‘ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయి’ పుస్తకంపై పూర్తి హక్కులను అమాష్‌ ఫిల్మ్స్‌ అనే సంస్థ యజమానులు దక్కించుకున్నారు. వాజ్‌పేయి బాల్యం నుంచి కళాశాల […]

సినిమాగా తెరకెక్కనున్న వాజ్‌పేయి జీవితం!
The life story of former Prime Minister Atal Bihari Vajpayee is set to unfold on the big screen
Ram Naramaneni
|

Updated on: Aug 27, 2019 | 9:57 PM

Share

బీజేపీ అగ్ర నేత, భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి జీవిత చరిత్ర వెండి తెరపైకి రాబోతోంది. ఆయన 2018, ఆగస్టు 16న కన్నుమూసి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఆయన జీవితంపై సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వాజ్‌పేయి జీవిత చరిత్రకు సంబంధించి ఉల్లేక్‌ అనే రచయిత రాసిన ‘ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయి’ పుస్తకంపై పూర్తి హక్కులను అమాష్‌ ఫిల్మ్స్‌ అనే సంస్థ యజమానులు దక్కించుకున్నారు. వాజ్‌పేయి బాల్యం నుంచి కళాశాల జీవితం, రాజకీయాల్లో మలుపు తిరిగిన క్షణాలు వీటన్నింటిని చిత్రీకరించనున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయనున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.