Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ కోరికలు అమ్మాయిలకే ఎక్కవ… హాట్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్

సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి వినిపిస్తున్న టాపిక్ క్యాస్టింగ్ కౌచ్. అయితే దీని పై చాలా మంది తమ అభిప్రాయాలను, చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు. అయినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ నిర్మాత ఇలా అని.. ఈ దర్శకుడు అలా అని చాలా మంది చెప్పుకొచ్చారు.

ఆ కోరికలు అమ్మాయిలకే ఎక్కవ... హాట్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 16, 2025 | 7:18 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ చిన్న చిన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. ఆమె చేసిన పాత్రలతో కంటే కొన్ని వివాదాలతో ఆమె పాపులర్ అయ్యింది. క్రేజీ కామెంట్స్ చేసి ఎక్కువగా వార్తల్లో నిలిచింది ఆమె. అంతే కాదు తెలుగులో సక్సెసఫుల్ గేమ్ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ పై కూడా ఆమె ఊహించని కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె మనుషుల్లో శృంగార కోరికల గురించి మాట్లాడుంది. ఈ క్రమంలో ఆమె అమ్మాయిల ఫీలింగ్స్ గురించి కూడా మాట్లాడింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లోనే ఆ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి అని తెలిపింది ఆమె..

సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి వినిపిస్తున్న టాపిక్ క్యాస్టింగ్ కౌచ్. అయితే దీని పై చాలా మంది తమ అభిప్రాయాలను, చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు. అయినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందా లేదా అన్నది అనుమానంగానే ఉంది.. అయితే తాజాగా అమ్మాయిల్లో శృంగారపు కోరికలు ఎక్కువగా ఉంటాయి అని తెలిపింది. వాటి వల్లే ఇల్లీగల్ ఎఫైర్స్ ఎక్కువ అవుతున్నాయి అని తెలిపింది.  ఆమె ఎవరో కాదు గాయత్రీ గుప్తా. ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన గాయత్రి గుప్తా. గతంలో చాలా కాంట్రవర్సీల్లో కనిపించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో గాయత్రి గుప్తా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అబ్బాయిల కంటే అమ్మాయిలే కోరికలు ఎక్కువగా ఉంటాయి అని గాయత్రీ తెలిపింది. అందువల్లే ఇల్లీగల్ ఎఫైర్స్ ఎక్కువ అవుతున్నాయి. కొద్ది రోజులు డేటింగ్ చేయడం, కోరికలు తీరగానే విడిపోవడం చేస్తున్నారు. పెళ్లిళ్లు నిలబడటం లేదు.. విడాకులు తీసుకుంటున్నారు. అని తెలిపింది. ఇప్పుడు అమ్మాయిలకు శృంగార కోరికలు వస్తే కంట్రోల్ చేసుకునే శక్తిని కూడా పెంచుకోవాలి. అమ్మాయిలు అలాంటి పరిస్థితులు వస్తే కంట్రోల్ చేసుకోవాలి. నా వరకూ నేను అయితే ఆ ఫీలింగ్స్ వస్తే కంట్రోల్ చేసుకుంటాను అని తెలిపింది గాయత్రీ గుప్తా ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.