Puneeth Rajkumar: బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి వేడుకలో పునీత్ రాజ్ కుమార్.. కంట తడి పెట్టించే ఎమోషనల్ వీడియో
కన్నడ బుల్లితెర యాంకర్, ప్రముఖ నటి అనుశ్రీ 37 ఏళ్ల వయసులో మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. తన ప్రియుడు, ఐటీ ఉద్యోగి రోషన్‌తో కలిసి ఏడడుగులు నడిచింది. అయితే ఈ నూతన వధూవరులిద్దరూ దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ అభిమానులే..

కన్నడ స్టార్ యాంకర్ అనుశ్రీ వివాహం ఇటీవలే జరిగింది. ఐటీ ఉద్యోగి రోషన్ తో ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఆగస్టు 28న బెంగళూరు శివార్లలోని కనకపుర రోడ్డులోని ఒక రిసార్ట్‌లో వీరీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు,సన్నిహితులు బంధువులు, సినీ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అనుశ్రీ, రోషన్ ఇద్దరూ దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ అభిమానులే. ఈ నేపథ్యంలో అప్పు ఫోటోను పూలతో అలంకరించి వివాహ వేదిక దగ్గర ఏర్పాటు చేశారు. అయితే ఇదే పెళ్లి వేడుక వేదికగా అనుశ్రీని భావోద్వేగానికి గురిచేసే ఒక సంఘటన జరిగింది. అనుశ్రీ, రోషన్ దంపతుల మధ్య పునీత రాజ్ కుమార్ ఉండే విధంగా ఫొటోను ఎడిట్ చేసి నూతన దంపతులకు బహుమతిగా ఇచ్చారు.ఈ ఫొటో చూసిన తర్వాత అనుశ్రీ ఎమోషనల్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ఈ ఫొటోను నూతన దంపతులకు బహూకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.
కాగా కన్నడనాట అనుశ్రీ కి మంచి గుర్తింపు ఉంది. తన టాలెంట్, యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుందీ అందాల తార. ముఖ్యంగా తన వాక్చాతుర్యంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ కన్నడలోనూ కూడా పాల్గొంది. అనుశ్రీ- రోషన్ ల వివాహానికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. శివరాజ్ కుమార్, అర్జున్ జన్య, విజయ్ రాఘవేంద్ర, విజయ్ ప్రకాష్, డాలీ ధనంజయ్ తదితర సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎమోషనల్ వీడియో ఇదిగో..
View this post on Instagram
ఇక అనుశ్రీ కూడా తన పెళ్లి ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక వివాహం తర్వాత కూడా అనుశ్రీ తన నటనను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
అనుశ్రీ, రోషన్ ల పెళ్లి వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







