AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara OTT: సెన్సేషనల్ మూవీ కాంతార ఓటీటీకి వచ్చేసింది.. కానీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదు

నేడు (24న ) కాంతారా మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Kantara OTT: సెన్సేషనల్ మూవీ కాంతార ఓటీటీకి వచ్చేసింది.. కానీ  ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదు
Kantara
Rajeev Rayala
|

Updated on: Nov 24, 2022 | 4:03 PM

Share

మోస్ట్ ఏవైటెడ్ మూవీ కాంతార ఓటీటీకి వచ్చేసింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కాంతార సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి (24న ) కాంతారా మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సుమారు 16కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 400కోట్ల రూపాయలను వసూల్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ఐఏండిబి భారతదేశంలోని ప్రస్తుత టాప్ 250 చిత్రాల జాబితాలో  కాంతార మొదటి స్థానంలో నిలిచింది. కన్నడలో రిలీజ్ తరువాత దాదాపు 15 రోజులకు ఇతర భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల తన సత్తాను చాటుకుంది.కన్నడిగుల సంప్రదాయమైన భూత కోల ఆచారం నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా కాంతార సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా పై పలు విమర్శలు కూడా వచ్చాయి.

ఈ సినిమాకు హైలైట్ క్లామాక్స్.. రిషబ్ శెట్టి నటన చివరిలో వచ్చే పాట సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తాయి. అయితే చివరిలో వచ్చే వరాహ రూపం పాట పై అభ్యంతరం వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ సాంగ్ మ్యూజిక్ కాపీ చేసిందంటూ కేరళకు చెందిన మ్యూజిక్ బ్రాండ్ తుక్కుడం బ్రిడ్జ్ ఆరోపించింది. ఐదేళ్ల క్రితం తమ బ్రాండ్ రూపొందించిన నవరసం సాంగ్ మ్యూజిక్ మాదిరిగానే వరాహారూపం సాంగ్ ఉందంటూ.. కాపీ రైట్స్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. దాంతో ఈ పాటను యూట్యూబ్ నుంచి కూడా తొలగించారు.

ఇవి కూడా చదవండి

తాజాగా ఓటీటీలో విడుదలైన  ఈ సినిమాలో క్లైమాక్స్ లో పాటను మార్చేశారు. ఆ పాట ట్యూన్ ను ఛేజ్ చేశారు. అలాగే మ్యూజిక్ కూడా మార్చేశారు. థియేటర్స్ లో ఆ మ్యూజిక్ వింటుంటే ఒళ్ళు గగ్గుర్పొడిచేది. కానీ ఓటీటీలో ఆ మ్యూజిక్ లేకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఓటీటీలోనూ కాంతార సినిమా మంచి వ్యూస్ ను రాబడుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!