గోల్డెన్ బ్యూటీకి కలిసొచ్చిన లక్కు.. మరో హిట్టు అందుకున్న సంయుక్త..

Rajitha Chanti

Pic credit - Instagram

18 January 2026

వకీల్ సాబ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ సంయుక్త మీనన్. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

సార్, విరూపాక్ష వంటి చిత్రాలతో వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈ భామకు అంతగా ఆఫర్స్ మాత్రం రాలేదు. ఇటీవలే అఖండ 2 చిత్రంతో మెప్పించింది. 

 బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాతో మరోసారి తన నటన, స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంది. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండక్కి మరో హిట్టు ఖాతాలో వేసుకుంది.

శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాతో కథానాయికగా మెప్పించిన సంయుక్త.. ఇప్పుడు చీరకట్టులో అందంతో మెస్మరైజ్ చేస్తుంది. 

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. పట్టుచీర కట్టుకుని అభిమానులను మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

 సింపుల్ హెయిర్ స్టైల్, జడలో మల్లె పువ్వులు పెట్టుకుని చేతిలో తామర పువ్వు పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. పెద్ద జుంకాలు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.

ఇప్పుడు సంయుక్త షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి 2016లో పాప్ కార్న్ సినిమాతో మలయాళీ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

తమిళం, కన్నడ, తెలుగు సినిమాలలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలతో అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.