AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఇది అసలైన బ్లాక్ బస్టర్.. టికెట్ ధర 20 రూపాయలు.. 11 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడం కామన్ గా వింటున్న మాట. అలాగే కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు భారీ విజయాన్ని అందుకుని కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. మరికొన్ని చిత్రాలు తీవ్ర నష్టాన్ని చూస్తు్న్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. కేవలం కోటి రూపాయలతో తీస్తే రూ.11 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయట.

Cinema : ఇది అసలైన బ్లాక్ బస్టర్.. టికెట్ ధర 20 రూపాయలు.. 11 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
Producer Aswani Dutt
Rajitha Chanti
|

Updated on: Jan 19, 2026 | 9:47 AM

Share

ప్రస్తుతం సినీరంగంలో ట్రెండ్ మారింది. చిన్న బడ్జెట్ చిత్రాల కంటే భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. రూ.100 కోట్లు ఖర్చు చేసి సినిమా తీస్తే రూ.10 కోట్లు లాభం రావడం కంటే కోటి ఖర్చు చేసి రూ.10 కోట్లు వచ్చిన సినిమానే అసలైన బ్లాక్ బస్టర్ అంటారు. ఇప్పుడు సినిమాలు కేవలం వారం పదిహేను రోజుల్లోనే రూ.100, 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. కానీ మీకు తెలుసా.. టికెట్ ధర కేవలం 20 రూపాయాలు. అయినా ఆ సినిమా మాత్రం రూ.11 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇంతకీ ఆ సినిమా గురించి నిర్మాత అశ్వినీదత్ ఏం చెప్పారో తెలుసుకుందామా. వైజయంతీ బ్యానర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా గతంలో నిర్మాత అశ్వినీదత్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన సినిమా పెళ్లి సందడి. డైరెక్టర్ రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మూవీ 1996లో విడుదలైంది. కేవలం రూ.1 కోటి 20 లక్షలతో నిర్మించిన ఈ సినిమాకు ఏకంగా రూ.11 కోట్ల 30 లక్షల వరకు కలెక్షన్స్ వచ్చాయట. అంతేకాదు.. అప్పట్లో సినిమా టికెట్ రేట్ కేవలం రూ.20 వరకు మాత్రమే ఉండేదని.. ఆ టికెట్ రేట్లతోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయంటే మాములు విషయం కాదు. అంటే అప్పట్లో ఆ సినిమా సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. పెట్టిన పెట్టుబడికి దాదాపు పది కోట్ల లాభం వచ్చిందని నిర్మాత అశ్వినీదత్ అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

అప్పట్లో ఆ సినిమా కొన్ని థియేటర్లలో 175 రోజులు ఆడింది. శ్రీకాంత్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఇది. అందుకే ఆయన కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఇది ఒకటి. అప్పట్లో సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ పెళ్లి సందడి సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ చిత్రంలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..